Hyderabad: తల్లి తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని కాపాడితే జీవితాంతం తన పిల్లలు ఓ స్థాయికి వచ్చేంత వరకు తండ్రి తోడునీడగా ఉంటాడు. తన పిల్లలకు తల్లి కడుపునిండా అన్నం పెడితే.. ఆ ప్రతి గింజలో తండ్రి కష్టం ఉంటుంది. పిల్లలకు తల్లి ఓదార్పు ఇస్తే.. తండ్రి తన గుండెల్లో పెట్టుకోని చూసుకుంటాడు. ప్రతిక్షణం తమ పిల్లలను అడుగడున తండ్రి తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తాడు. ఆడపిల్లను అల్లారు ముద్దుగా పెంచి పోషించి అత్తారింటికి పంపేంచే వరకు ఆ తండ్రి పడే ఆవేదన అంతా ఇంతా కాదు. అలాంటి తండ్రిని ఓ కసాయి కూతురు గొంతు కోసి హత్య చేసింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలో చోటు చేసుకుంది.
Read also: Karumuri Nageswara Rao: చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి.. జగన్‌ను మళ్లీ సీఎం చేయాలి
అంబర్ పేట్ తులసీరామ్ నగర్ లో జగదీష్ కుటుంబం నివసిస్తోంది. జగదీష్ స్థానికంగా కూలి చేసుకుంటూ ఉండగా, అతని కూతురు నికిత పండ్ల దుకాణంలో పనిచేస్తోంది. కానీ తండ్రి జగదీష్ మాత్రం తన కూతురు నికితను ఏదో ఒక మాటకు తిట్టాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న నికిత తండ్రిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. గాజు పెంకుతో అతని గొంతును అతి కిరాతకంగా కోసేసింది. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న జగదీష్‌ను కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జగదీష్ ఆదివారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. కుమార్తె నికితను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే జగదీష్ హత్య వెనుక మరో కారణం కూడా ఉంది. నిఖిత రోజూ మద్యం తాగినందుకే తండ్రిపై గ్లాస్‌తో దాడి చేసినట్లు సమాచారం. అయితే జగదీష్ మృతిపై పోలీసుల విచారణలో వాస్తవాలు బయటకు రానున్నాయి.
Salaar: థియేటర్స్ లో సలార్… అప్పుడే సెప్టెంబర్ 28 వచ్చినట్లు ఉంది