Revanth Reddy Leading in Kodangal and kamareddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడంగల్ స్థానంతో పాటు కేసీఆర్ పోటీ చేస్తున్న నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి కూడా పోటీకి దిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లో రేవంత్ రెడ్డి ఈ రెండు స్థానాలలోనూ ఆధిక్యత కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కొడంగల్ , కామారెడ్డి ల్లో మూడో రౌండ్ లోను రేవంత్ లీడ్.. కొడంగల్ 4159, కామారెడ్డి లో 2354 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అ ఇక కామారెడ్డిలో రెండో రౌండ్ లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. నిజానికి కాంగ్రెస్ లో ఒక టికిట్ దొరకటమే గగనం అనుకుంటే రేవంత్ రెడ్డికి రెండు టికెట్లు ఇవ్వడం మీద పెద్ద ఎత్తున అప్పట్లో చర్చ జరిగింది.
Congress Leading: అధిక స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్
Telangana Election Results 2023: అయితే అధిష్టానం సూచనల మేరకు మాత్రమే తాను కామారెడ్డిలో పోటీకి దిగానని రేవంత్ రెడ్డి ఆ తర్వాత పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే పూర్తి ఎన్నికల ఫలితాలు వెలువడే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే కేసీఆర్ ను విజయవంతంగా రేవంత్ రెడ్డి వెనుకంజలోకి కామారెడ్డి విషయంలో నెట్టారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇక కాంగ్రెస్ కి స్పష్టమైన ఆధిక్యం అన్ని ప్రాంతాలలో కనిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కానీ మొదటి రెండు మూడు రౌండ్స్ కే ఇలా అనుకోవడం కరెక్ట్ కాదని పూర్తిగా ఎన్నికల ఫలితాలు వెలువడే సమయానికి కచ్చితంగా మెజారిటీ తమకు వస్తుందని బిఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.