బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో దాదాపు ముగింపు దశకు చేరుకుంది.. ప్రస్తుతం 12 వారం జరుగుతుంది.. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది.. ఇంకా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కొనసాగుతుంది. ఉల్టా పుల్టా అంటూ తీసుకొచ్చిన ఈ సీజన్ మొదటి వారం నుంచి మంచి టీఆర్పీ రేటింగ్ అందుకుంటుంది.. ఈ సీజన్ లో హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వారం షో హిట్ అయ్యింది..ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు దగ్గర పడుతోంది. అయితే బిగ్బాస్ లెక్కలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టమే.
ఈ ఆట చివరి దశకు వచ్చేటప్పకీ మాత్రమే టైటిల్ విజేత ఎవరనే విషయం ఓ అంచనాకు వస్తుంది. గత సీజన్లలో ఫ్యామిలీ వీక్ తర్వాత విన్నర్, టాప్ 5 ఎవరనేది క్లారీటీ వస్తుండేది.. మొన్నటివరకు హౌస్ లో టాప్ 5 మొదట శివాజీ, సెకండ్ ప్రశాంత్, మూడో స్థానంలో ప్రశాంత్ ఉన్నారు.. ఇప్పుడు లెక్కలు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తుంది.. మొన్నటి వరకు ఫుల్ నెగిటివిటీ ఉన్న అమర్ దీప్ ఇప్పుడు పాజిటివ్ ఫుటేజ్ వస్తుంది. దీంతో ఓటింగ్ లో దూసుకెళ్తున్నాడు. ఇక టాప్ 3లో ఉన్న శివాజీ, ప్రశాంత్, యావర్ ఓటింగ్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది..
అందుతున్న సమాచారం ప్రకారం టాప్ లో అమర్ ఉండగా, మూడో స్థానంలో శివాజీ ఉన్నారు.. అమర్ దీప్.. 31.1% శాతం ఓటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నాడు.. ఇక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ 23.97 %తో రెండవ స్థానంలో ఉండగా.. శివాజీకి ఓటింగ్ సగానికి పైగా పడిపోయింది. కేవలం 15.19% ఓటింగ్ తో మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక డాక్టర్ బాబుకు శుక్రవారం ఉదయం వరకు 10.99% ఓట్లు రాగా నాల్గవ స్థానంలో ఉన్నాడు.. ఇక చివరగా అశ్విని ఉన్నట్లు తెలుస్తుంది.. మరి ఈ ఓటింగ్ చివరి వరకు ఉంటుందా.. తారుమారు అవుతుందా చూడాలి..