Bandi Sanjay: రైతులారా…. ఎకరానికి మోదీ చేసే సాయం రూ.24 వేలు.. కేసీఆర్ చేసే సాయం రూ.10 వేలు మాత్రమే.. రైతు పక్షపాతి ఎవరో మీరే ఆలోచించి ఓటేయాలని బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే… వరి కనీస మద్దతు ధర రూ.3100 చేస్తామన్నారు. మహిళలకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. కరీంనగర్ ఐటీ టవర్ లో తొండలు గుడ్లు పెడుతున్నాయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Mynampally Hanumanth Rao: కల్వకుంట్ల కుటుంబం మాటల గారడీ ఇక చెల్లదు..
ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేని దద్దమ్మ గంగుల అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులది భూకబ్జాల చరిత్ర ఉందని మండిపడ్డారు. ఎన్నికలైపోగానే ఇద్దరూ ఒక్కటై కేసులు సెటిల్ చేసుకుంటారని అన్నారు. కానీ నాపై ఉన్న కేసుల పరిస్థితి ఏంది? నాది ప్రజల పక్షాన పోరాటాల చరిత్ర అని అన్నారు. గొర్లు ఇస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసిన గంగుల.. పద్మశాలీలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. నేను ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే అవన్నీ ప్రజలకు రాసిస్తా? అని తెలిపారు. ప్రవాస భారతీయులారా… మీకోసం కొట్లాడుతున్న బీజేపీకి ఓటేయండి అని కోరారు.
Priyanka Gandhi: భవిష్యత్ లో బీఆర్ఎస్ ను మ్యూజియంలో చూస్తారు..