చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ షావోమీ మార్కెట్ లో తన సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ ఫీచర్లతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను రూపొందిస్తూ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. దీంతో షావోమీ ఉత్పత్తులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు మరో కొత్త ప్యాడ్ ను లాంఛ్ చేసింది. మతిపోగొట్టే ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 7 ను నేడు దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది.