WhatsApp Update: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇప్పుడు కాల్స్‌కి సమాధానం రాకపోతే వెంటనే వాయిస్ మెసేజ్ పంపే అవకాశం వాట్సప్ యాప్‌లో రానుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్ (2.25.23.21) వాడుతున్న కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఎలా పనిచేస్తుందన్న విషయానికి వస్తే.. WABetaInfo సమాచారం ప్రకారం, ఒక కాల్ అటెండ్ కాకపోతే కాల్ స్క్రీన్ కింద ఒక కొత్త “Record Voice Message” బటన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే, యూజర్లు వెంటనే వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి పంపవచ్చు. మళ్లీ కాల్ చేయకుండా, తక్షణమే తమ సందేశాన్ని పంపడానికి ఇది సులభమైన మార్గంగా మారనుంది.
BCCI: బీసీసీఐలో ఉద్యోగాలు.. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే?
ఈ ఫీచర్ కేవలం కాల్ స్క్రీన్‌లోనే కాకుండా.. మిస్ కాల్ జరిగిన చాట్ విండోలో కూడా కనిపిస్తుంది. ఇలా యూజర్లు వెంటనే వాయిస్ మెసేజ్ పంపి, మిస్ కాల్‌కు ఫాలోఅప్ చేయగలరు. సాధారణ వాయిస్ నోట్స్ పంపే అవకాశం ఉన్నప్పటికీ, ఈ కొత్త ఆప్షన్ సమయానికి సరైన రిమైండర్ లాగా పనిచేస్తుంది. రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్ చాట్‌లో ఆటోమేటిక్‌గా పంపబడుతుంది. రిసీవర్ తనకు వీలైనప్పుడు ఆ వాయిస్ నోట్ వినవచ్చు. అంతేకాకుండా, మిస్ కాల్ నోటిఫికేషన్ కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. దాంతో యూజర్లు మిస్ కాల్, వాయిస్ మెసేజ్ రెండింటినీ గమనించే అవకాశం ఉంటుంది.
YouTube Music: 10వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ‘యూట్యూబ్ మ్యూజిక్’.. కొత్త ఫీచర్స్ ఇవే!
వాట్సప్ ఈ ఫీచర్‌తో పాటు మరికొన్ని కొత్త అప్‌డేట్స్‌పై కూడా పని చేస్తోంది. వీటిలో “Writing Help” అసిస్టెంట్, యూజర్లకు రైటింగ్ సజెషన్స్ ఇవ్వడం, అలాగే Motion Photos సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి యూజర్లకు మరింత ఇంటరాక్టివ్ అనుభవం ఇవ్వనున్నాయి. మొత్తానికి, ఈ వాయిస్ మెసేజ్ ఫీచర్ మిస్ కాల్స్‌కి వెంటనే స్పందించడానికి వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా కానుంది.