వాట్సాప్ సేవలు ఈ మధ్యే ఏకంగా దాదాపు 2 గంటల పాటు ఆగిపోయాయి.. యూజర్లు మాత్రం అల్లాడిపోయారు.. దీనిపై ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో తమ గోడును వెల్లబోసుకున్నారు.. ముఖ్యంగా ట్విట్టర్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు.. సెటైర్లు కూడా వేశారు.. మరోవైపు కొత్త కొత్త ఫీచర్లను తమ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది ఈ పాపులర్ మెసేజింగ్ యాప్… తన యూజర్లు ఏ మాత్రం చేజారకుండా.. మరికొంతమందిని ఆకట్టుకునేలా కొత్త ఫీచర్లతో అదరగొడుతూనే ఉంది.. తాజాగా, డెస్క్‌టాప్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది.. అదే ఇమేజ్ బ్లర్ టూల్… ప్రస్తుతం ఇది కొందరు డెస్క్ టాప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్… త్వరలో యూజర్లందరికీ ఈ నయా ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది..
Read Also: AP Capitals: విశాఖతో పాటు అమరావతి కూడా బాగుండాలి.. అదే మా కోరిక
అసలు ఇమేజ్ బ్లర్ టూల్ ఏంటి..? అది ఎలా పనిచేస్తుంది..? అనే విషయాల్లోకి వెళ్తే.. అవతలి వ్యక్తికి ఫొటోను సెండ్ చేయాల్సిన వచ్చినప్పుడు.. ఆ ఫొటోలోని ఏదైనా భాగాన్ని ఈ టూల్ సాయంతో బ్లర్ చేసే అవకాశం కల్పిస్తోంది వాట్సాప్.. అంటే రిసీవర్‌కు ఫొటోలోని ఏదైనా భాగం కనిపించకుండా చేయాలనుకుంటే.. బ్లర్ చేసి పంపించే సదుపాయం ఈ టూల్ ద్వారా ఉంటుందన్నమాట.. సాధారణంగా కొన్ని సందర్భాలు ఫొటోలను అలాగే పంపి.. ఇబ్బందులు పడిన యూజర్లు కూడా ఉన్నారట.. దీంతో.. వారి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ నయా ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్.. త్వరలోనే ఇమేజ్ బ్లర్ ఫీచర్‌ను మొబైల్ బీటా వెర్షన్‌కు కూడా తెచ్చే అవకాశం ఉందని.. టెస్టింగ్ పూర్తయ్యాక యూజర్లందరికీ ఈ బ్లర్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ వర్గాలు చెబుతున్నమాట..
మరోవైపు.. ఈ మధ్య తన యూజర్ల కోసం వరుసగా కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది మెసేజింగ్ యాప్ వాట్సాప్.. గ్రూప్‌ల నుంచి సైలెంట్‌గా లెఫ్ట్ కావడం.. ఆన్‌లైన్ యాక్టివ్ స్టేటస్‌ను హైడ్ చేసుకోవడం, వ్యూవన్స్ మెసేజ్‌లకు స్క్రీన్‌షాట్స్‌ను బ్లాక్ చేయడం లాంటి ఫీచర్లపై వర్క్ చేస్తోంది.. ఇప్పుడు ఇమేజ్ బ్లర్ టూల్ కూడా వచ్చేస్తోంది. కాగా, వాట్సాప్‌కు ఉన్న పాపులారిటీ ఏంటో.. మొన్న దాదాపు రెండు గంటల పాటు దాని సేవలు స్తంభించినప్పుడే తెలిసిపోయింది.. క్రమంగా తన యూజర్లను ఆక్టుకునేలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అదరగొడుతూనే ఉంది ఈ సోషల్ మీడియా పాలుపులర్ మెసేజింగ్ యాప్..