Vivo G3 5G: ఐదేళ్ల బ్యాటరీ వారంటీ, డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్‌తో వివో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్లు, ధర ఇలా!
- ఫైవ్-స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్
- 6,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 5 ఏళ్ల బ్యాటరీ హెల్త్ వారంటీ,
- 13MP రియర్ కెమెరా LED ఫ్లాష్‌తో పాటు, 5MP ఫ్రంట్ కెమెరా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo G3 5G: వివో కంపెనీ తమ ‘G’ సిరీస్‌లో కొత్త మోడల్ Vivo G3 5Gను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. జనవరి 2024లో లాంచ్ అయిన Vivo G2 5Gకి ఇది అప్డేటెడ్ గా వచ్చింది. తాజా మోడల్ లో భారీ బ్యాటరీ, కొత్త ప్రాసెసర్‌తో పాటు ప్రాక్టికల్ స్పెసిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, గ్లోబల్ లాంచ్‌పై ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
ఈ కొత్త వివో G3 5G 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర చైనాలో 1,499 CNY అంటే రూ.18,300 నుండి ప్రారంభమవుతుంది. ఇక టాప్ వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్ ధర CNY 1,999 అంటే సుమారు రూ.24,౩౦౦గా ఉంది. ఈ ఫోన్ కేవలం డైమండ్ బ్లాక్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది.
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్‌లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
APPAR ID: CBSE కీలక నిర్ణయం.. ఇకపై విద్యార్థులకు ఆ ఐడి లేనట్లయితే బోర్డు పరీక్షలు రాయలేరు!
ఈ వివో G3 5G SGS ఫైవ్-స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ తో వస్తోంది. అంటే ఇది బలమైన బిల్డ్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉండగా కంపెనీ 5 ఏళ్ల బ్యాటరీ హెల్త్ వారంటీ ఇస్తోంది. ఇక దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే ఇందులో 6.74 అంగుళాల LCD స్క్రీన్ (720×1600 పిక్సెల్ రిజల్యూషన్) ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 1500:1 కాంట్రాస్ట్ రేషియో సపోర్ట్ చేస్తుంది.
ఇక మొబైల్ పనితీరు కోసం ఫోన్ MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్, Mali-G57 GPUతో వస్తుంది. ఇది 6GB/8GB LPDDR4X RAM ఆప్షన్లలో లభిస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 256GB UFS 2.2 వేరియంట్, 1128GB eMMC 5.1 వేరియంట్ అందుబాటులో ఉన్నాయి. ఇక మొబైల్ కెమెరా విభాగంలో కేవలం 13MP రియర్ కెమెరా LED ఫ్లాష్‌తో పాటు, 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది ఈ మొబైల్ డ్రాబ్యాక్ గా చెప్పవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OriginOS 15 పని చేస్తుంది.
ఈ ఫోన్‌లో 5G, డ్యూయల్-బ్యాండ్ WiFi, Bluetooth 5.4, GPS, 3.5mm ఆడియో జాక్, IR బ్లాస్టర్, USB 2.0 పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ కొత్త Vivo G3 5G మొబైల్ డైమెన్షన్స్ 167.3 x 76.95 x 8.19mm కాగా, బరువు 204 గ్రాములు మాత్రమే.
తాజావార్తలు
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..