Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో రాజకీయంగా కలకలం రేపిన మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్లకురిచ్చి టీవీకే (TVK) ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు పోలీసులు.
జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలతో వెలుగులోకి వచ్చిన వివాదం
కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. ఇదే అంశంపై ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ అన్నాడీఎంకేకు చెందిన న్యాయవాది ఆర్. తిరిసూలి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read
- Punjab BJP-SAD Alliance 2027: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. మళ్లీ చేతులు కలిపిన బీజేపీ-అకాలీదళ్!
- SP - Congress Alliance: కాంగ్రెస్ ఆశలకు ఎస్పీ బ్రేక్ వేయనుందా..? తెరపైకి 26 సీట్ల ఫార్ములా..!
- Sonia Gandhi: 'నాన్నను చంపించడానికే భద్రత తొలగించారు'.. రాజీవ్ గాంధీ హత్యపై సోనియా సంచలన వ్యాఖ్యలు!
- PM-KISAN Rules: తండ్రీకొడుకులు ఇద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయి..?
తొలుత ఫిర్యాదు అందలేదన్న పోలీసులు
ఈ పిటిషన్ నవంబర్ 23న జస్టిస్ లక్ష్మీ నారాయణన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మహిళా జిల్లా కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి పోలీసుల తరఫున హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన క్రిమినల్ న్యాయవాది ఆర్. జాన్ సత్యన్ స్పందిస్తూ.. సంబంధిత జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు అందలేదని కోర్టుకు వివరించారు.
కలెక్టర్, సీఎస్‌ను మరోసారి విచారించాలన్న హైకోర్టు
ఈ వ్యవహారంలో అసభ్యకర సందేశాలు పంపి ఉంటే అది దురదృష్టకరమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మరోసారి సంప్రదించి, ఈ అంశంపై వివరాలు సేకరించాలని పోలీసులను ఆదేశించారు. నవంబర్ 24న తదుపరి విచారణ సందర్భంగా పూర్తి వివరాలు తెలియజేయాలని సూచిస్తూ కేసు విచారణను వాయిదా వేశారు.
కలెక్టర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్
ఈ పరిణామాల మధ్య నవంబర్ 23న సోమవారం మధ్యాహ్నం కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం వెలువడింది. ఎమ్మెల్యే తనతో అనుచితంగా ప్రవర్తించారని, అవసరం లేని సందేశాలు పంపించారని కలెక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
హైకోర్టుకు పోలీసుల కీలక సమాచారం
ఈ కేసు నవంబర్ 24న మరోసారి జస్టిస్ లక్ష్మీ నారాయణన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తూ.. అసభ్యకర సందేశాలు పంపినట్లు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కల్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కోర్టుకు తెలియజేశారు. దీంతో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..!
-
Hyderabad Green Tankers: గ్రీన్ ట్యాంకర్ల పేరుతో మురుగు నీటి సరఫరా కలకలం.. ఖాజాగూడలో ఏం జరుగుతోంది?
-
Punjab BJP-SAD Alliance 2027: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. మళ్లీ చేతులు కలిపిన బీజేపీ-అకాలీదళ్!
-
AP Panchayat Elections: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
-
Sakkshi Mhadolkar: డైలాగులు లేవని ఫ్రెండ్స్ ఏడిపించేవారు.. ‘ఫ్యామిలీ ప్యాక్’తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తా!
ట్రెండింగ్
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!