APPAR ID: కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25న జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో APAAR (Automated Permanent Academic Account Registry) IDను విద్యార్థులందరికీ తప్పనిసరి చేసింది. ఈ ఐడీ లేకుండా ఇకపై 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు. ఈ సమావేశంలో CBSE స్పష్టంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ APAAR ID తప్పనిసరని తెలిపింది. దీనికోసం అన్ని పాఠశాలలు తమ విద్యార్థుల APAAR IDలను సృష్టించాల్సి ఉంటుంది. ఐడీ లేకుండా బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉండదని నిబంధన జారీ చేసింది.
Pakistan China Relations: డ్రాగన్ గుప్పిట్లోకి పాక్.. అన్నింటికి దాయది దారి అటే..!
APAAR ID అంటే ఏమిటి?
APAAR ID అనేది ఒక దేశం – ఒక విద్యార్థి ఐడీ (One Nation, One Student ID) పథకంలో భాగం. ఈ పథకం ప్రకారం ప్రతి విద్యార్థికి 12 అంకెల ప్రత్యేక డిజిటల్ ఐడీ కేటాయించబడుతుంది. ఈ ఐడీ ద్వారా విద్యార్థి అన్ని అకడమిక్ రికార్డులు అంటే స్కూల్ వివరాలు, మార్కుల పట్టికలు, సర్టిఫికెట్లు, ఇతర విద్యా సంబంధిత డాక్యుమెంట్లు ఇలా అన్ని ఒకే చోట భద్రపరచబడతాయి. భవిష్యత్తులో విద్యార్థులు తమ APAAR ID ద్వారా ఒక్క క్లిక్‌లోనే ఈ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అంటే, మొదటి తరగతి నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థి సంబంధిత పూర్తి విద్యా చరిత్ర ఈ ఐడీ ద్వారా ప్రభుత్వ డేటాబేస్‌లో నిల్వ ఉంటుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో విద్యార్థుల APAAR IDలు సృష్టించబడుతున్నాయి. దీని ద్వారా స్కూల్ డ్రాప్‌అవుట్ సమస్యపై కూడా పర్యవేక్షణ చేయగలమని అధికారులు చెబుతున్నారు.
APAAR ID ఎలా క్రియేట్ చేసుకోవాలి?
APAAR ID క్రియేట్ బాధ్యత ప్రధానంగా పాఠశాల యాజమాన్యందే. ఇందుకోసం CBSE పాఠశాలలకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. UDISE+ పోర్టల్లో విద్యార్థుల రిజిస్ట్రేషన్ చేసే ముందు APAAR ID సృష్టించాలి. విద్యార్థులు ఆధార్ కార్డును అందించాలి. 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదివే విద్యార్థుల రిజిస్ట్రేషన్ కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని CBSE ఆదేశించింది. ఇకపోతే ఈ APPAR ID ప్రస్తుతం 9 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు మాత్రమే తప్పనిసరి చేసినా త్వరలో అన్ని తరగతుల విద్యార్థులకూ APAAR ID తప్పనిసరి అవుతుందని భావిస్తున్నారు.