Dimple Hayathi: నా పెళ్లి ఎప్పుడైంది బాబూ? నెటిజన్ కామెంట్‌కు డింపుల్ హయాతి క్రేజీ రిప్లై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dimple Hayathi: అసలు విషయం ఏంటో తెలియకుండానే సోషల్ మీడియాలో కొందరు ఏదేదో ఊహించేసుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయాతి విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఏకంగా ఆమెకు పెళ్లి కూడా అయిపోయిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడంతో, డింపుల్ తనదైన స్టైల్లో ఫన్నీ కౌంటర్ ఇచ్చి అందరినీ నవ్వించేసింది. యంగ్ హీరో శర్వానంద్ నటించిన యాక్షన్ మూవీ ‘భోగి’ ఈ నెల 27న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రీసెంట్గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో డింపుల్ హయాతి పాల్గొని సందడి చేసింది. స్టేజ్‌పై తన గ్లామర్, ఎనర్జీతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. అయితే, ఈ వేడుకలో స్టేజ్‌పై ఉన్న డింపుల్, పక్కనే ఉన్న శర్వానంద్ వైపు కొద్దిగా వంగి ఏదో సరదాగా మాట్లాడుతున్న ఓ చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఓ మీమ్ పేజీ సరదాగా ఈ వీడియోను షేర్ చేయడంతో దాని కింద కామెంట్ల వర్షం మొదలైంది. అందులో ఒక నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. “శర్వానంద్ లాగే డింపుల్ హయాతికి కూడా పెళ్లయిపోయింది కదా” అంటూ ఓ కామెంట్ వదిలాడు. అది చూసిన డింపుల్ ఏమాత్రం సీరియస్ అవ్వకుండా చాలా కూల్‌గా, అంతే సరదాగా రియాక్ట్ అయ్యింది. నాకు ఇంకా పెళ్లి కాలేదంటూ ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి స్టేజ్‌పై కో-స్టార్స్ ఇద్దరూ ఏదో క్యాజువల్‌గా మాట్లాడుకుంటే, దానికి ఏవేవో లింకులు పెట్టేసి ఏకంగా పెళ్లి వార్తల వరకు తీసుకెళ్లారు. కానీ డింపుల్ హయాతి ఇచ్చిన ఒక్క స్వీట్ పంచ్‌తో ఆ గాసిప్స్‌కు అక్కడికక్కడే ఫుల్ స్టాప్ పడిపోయింది. ఏదేమైనా ఈ వీడియో, దానికి డింపుల్ ఇచ్చిన రిప్లై పుణ్యమా అని ‘భోగి’ సినిమాకు సోషల్ మీడియాలో మంచి ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్టయిందని అంటున్నారు. మరి నవంబర్ 27న రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Dimple Hayathi: నా పెళ్లి ఎప్పుడైంది బాబూ? నెటిజన్ కామెంట్‌కు డింపుల్ హయాతి క్రేజీ రిప్లై!
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..!
-
Hyderabad Green Tankers: గ్రీన్ ట్యాంకర్ల పేరుతో మురుగు నీటి సరఫరా కలకలం.. ఖాజాగూడలో ఏం జరుగుతోంది?
-
Punjab BJP-SAD Alliance 2027: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. మళ్లీ చేతులు కలిపిన బీజేపీ-అకాలీదళ్!
ట్రెండింగ్
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!