Infinix HOT 60i 5G: స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒక్కటైన ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్‌లో తన కొత్త బడ్జెట్ 5G ఫోన్ HOT 60i 5Gను విడుదల చేసింది. ఇది ఇదివరకు విడుదలైన HOT 60 5G+ తర్వాత మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్ 6.75 అంగుళాల 120Hz రిఫ్రెష్‌రేట్ డిస్‌ప్లే, డైనమిక్ పోర్ట్ ఫీచర్‌తో నోటిఫికేషన్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ కొత్త HOT 60i 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4GB RAM (అదనంగా 4GB వర్చువల్ RAM సపోర్ట్) ఉంది. ఈ ఫోన్ Android 15పై నడుస్తుంది. కంపెనీ ప్రకారం ఇది 5 ఏళ్లపాటు ల్యాగ్-ఫ్రీ పనితీరును అందిస్తుంది.
అలాగే ఇందులో Circle to Search, AI Call Translation, AI Summarization, AI Writing Assistant, AI Eraser (ఫోటో ఎడిటింగ్ కోసం), AI Wallpaper Generator వంటి ఆధునిక AI ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా వినియోగదారులకు హ్యాండ్స్-ఫ్రీ అనుభవాన్ని కల్పిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా Ultra Link Technology ద్వారా నెట్‌వర్క్ అందుబాటులో లేకున్నా అత్యవసర కమ్యూనికేషన్ సదుపాయం లభిస్తుంది.

Nara Lokesh: ఢిల్లీకి పయనంకానున్న మంత్రి లోకేష్.. అందుకేనా?
అలాగే ఈ ఇన్‌ఫినిక్స్ HOT 60i 5Gలో 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్, 670 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో 50MP రియర్ కెమెరా LED ఫ్లాష్‌తో లభిస్తుంది. ఇది 2K 30fps వీడియో రికార్డింగ్ చేయగలదు. అలాగే 5MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇక మొబైల్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు.

ఇక మొబైల్ పవర్ పరంగా 6000mAh భారీ బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కలదు. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. దీన్ని microSD కార్డ్ ద్వారా ఏకంగా 2TB వరకు విస్తరించుకోవచ్చు. అలాగే ఈ HOT 60i 5G ఫోన్‌కు IP64 రేటింగ్ ఉంది. ఇది డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తుంది. వినియోగదారుల కోసం 3.5mm ఆడియో జాక్, DTS సపోర్ట్‌తో సింగిల్ స్పీకర్ కూడా అమర్చారు.
Rahul Gandhi Bihar Yatra: బీహార్‌లో ఓట్ల దోచుకునేందుకు చూస్తున్నారు: రాహుల్ గాంధీ

ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 4GB + 128GB వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.9,299గా నిర్ణయించారు. అయితే ప్రీపెయిడ్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.300 డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో మొబైల్ ధర రూ.8,999 అవుతుంది. ఇన్‌ఫినిక్స్ HOT 60i 5G షాడో బ్లూ, మాన్సూన్ గ్రీన్, ప్లమ్ రెడ్, స్లీక్ బ్లాక్ వంటి రంగుల్లో లభించనుంది. ఆగస్ట్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివిధ రిటైల్ స్టోర్లలో లభ్యం కానుంది. ఇంత ధరలోనే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కూడిన 5G ఫోన్ అందుబాటులో ఉండటం వినియోగదారులకు ఆకర్షణీయంగా మారనుంది.
