Smart Toys: ఇళ్లల్లో చిన్న పిల్లలకు మాటలు నేర్పించేందుకు ఇంటిలో ఉండే పెద్దవారు ప్రయత్నం చేస్తారు. వారితో చిన్న చిన్న మాటలు చెబుతూ.. వారికి మాటలు నేర్పిస్తారు. అలాగే వారికి చిన్న చిన్న కథలను వినిపిస్తూ ఉంటారు. ఇలా చేయడంతో పిల్లల్లో జ్ఞానం పెరగడమే కాకుండా.. వారికి ఆలోచనా శక్తి పెరుగుతుంటుందని మానిసిక శాస్ర్తవేత్తలు చెబుతుంటారు. మామూలుగా అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ ఇంటిలో చిన్న పిల్లలు ఉంటే వారితో అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మలు వారికి మాటలు నేర్పించడం.. కథలు చెప్పడం చేస్తుంటారు. మారిన జీవన శైలి.. పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ఇపుడు చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్‌తోనే ఆడుకుంటున్నారు.. అందులోనే రైయిమ్స్ చూస్తున్నారు.. అందులోనే కథలు వింటున్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక టెక్నాలజీ అయిన ఆర్టిపిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) నేరుగా పిల్లలకు కథలు చెప్పడం.. మాటలు నేర్పించడం చేయనుంది. ఏఐ ఏంటీ.. చిన్న పిల్లలకు మాటలు నేర్పడమేంటీ.. కథలు చెప్పడమేంటీ అనుకుంటున్నారా? జరగబోయేది అదే.. ఇదిగో ఇలా..
Read also: Assam Floods: అస్సాంలో వరదలు.. 20 జిల్లాల్లో 1.20 లక్షల మందిపై ప్రభావం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో పలు రంగాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్న విషయాలను చూస్తున్నాం. భవిష్యత్‌లో పిల్లలకు కథలు చెప్పే చాట్‌జీపీటీ ఆధారిత టెడ్డీ బేర్స్ రానున్నాయి. పిల్లలతో మాట్లాడే స్మార్ట్ టాయ్స్ మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. పిల్లలతో ముచ్చట్లు చెప్పేలా స్మార్ట్ టాయ్‌లు 2028 నుంచి ఏఐ టెక్నాలజీని వాడనున్నాయి. ఏఐ ఆధారిత టాయ్‌లు పిల్లలకు బెడ్‌టైమ్(పడుకునే ముందు) స్టోరీస్ చెబుతాయని వీటెక్ హోల్డింగ్స్ సీఈవో అలన్ వాంగ్ తెలిపారు. చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏఐ చాట్‌బాట్ మనుషుల తరహాలో స్పందిస్తుండటంతో ఎన్నో టాస్క్‌లకు దీన్ని ఉపయోగిస్తున్నారు. చాట్‌జీపీటీకి విశేష ఆదరణ రావడంతో గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ బింగ్ అనే చాట్‌బాట్స్‌ను కూడా లాంఛ్ చేశాయి.
Read also: Andrapradesh : రెస్టారెంట్ లో ఫుడ్ తింటున్నారా? వీటిని తింటే డైరెక్ట్ స్మశానానికే..!
న్యూ టెక్నాలజీతో చిన్న పిల్లలు సైతం ఏఐ చాట్‌బాట్‌తో ఇంటరాక్ట్ అవుతారని ఎలక్ట్రానిక్ టాయ్ మేకర్ వీటెక్ హోల్డింగ్స్ వ్యవస్ధాపకులు వాంగ్ తెలిపారు. 2028 నాటికి చాట్‌జీపీటీ తరహా టెక్నాలజీని బొమ్మల పరిశ్రమలోకి రానుందని తద్వారా పిల్లలతో మాట్లాడే స్మార్ట్ టాయ్‌లను తయారు చేసేందుకు అడుగులు వేస్తుందన్నారు. పిల్లలు బుక్స్ నుంచి చదివేందుకు ప్రత్యామ్నాయంగా పిల్లల కోసం స్టోరీలను చెప్పేందుకు టెడ్డీ బేర్స్ వంటి స్మార్ట్ టాయ్స్ ఏఐని వినియోగిస్తాయని అంచనా వేశారు. పిల్లలకు స్టోరీలను వినిపించడమే కాకుండా ఏఐ ఆధారిత టాయ్స్ పిల్లల అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్డ్ స్టోరీలను చెప్పగలిగే సామర్ధ్యం కలిగిఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకపై పిల్లలకు కథలు చెప్పడానికి స్మార్ట్ టాయ్స్ అందుబాటులోకి రానున్నాయి.