Smart Phone Tips : మీ స్మార్ట్ ఫోన్ నీళ్లలో తడిసిందా.. అయితే ఇలా చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. ఈ ఫోన్ లేకుండా ఎవ్వరూ ఉండలేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా మనలో చాలా మంది ఫోన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోవడం లేదా వర్షంలో తడిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తమ ఫోన్ ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయిన లేదా వర్షానికి తడిసినా ముందుగా మీ డివైజ్ ను ఆఫ్ చేయండి. ఫోన్ లోపలికి నీరు చేరిన తర్వాత ఫోన్ ను ఆన్ లో ఉంచితే మరింత నష్టం జరగొచ్చు. అలాగే మీ ఫోన్ నీటిలో పడినప్పుడు, ఆ నీటిని బయటకి పంపేందుకు దాన్ని ఎక్కువగా షేక్ చేస్తే ఆ నీరుఫోన్ లోపలి భాగాల్లోకి చేరే ప్రమాదం కూడా ఉంది.
Also Read : Anchor Sreemukhi: పెళ్లికూతురుగా శ్రీముఖి అదుర్స్.. వేదిక ఎక్కడంటే
Also Read
- Poco C81 Pro: పోకో సి81 ప్రో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, యునిసోక్ టి7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్
- Motorola Edge 70 Fusion: 7000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్‌తో.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ కొత్త వేరియంట్ విడుదల
- Lenovo ThinkPad L13 Gen 7: లెనోవో థింక్‌ప్యాడ్ L13 జెన్ 7 ల్యాప్‌టాప్ విడుదల.. 16GB ర్యామ్, 2TB స్టోరేజ్
- Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
మరికొందరు ఫోన్ లోపల నీరు ఆరిపోవాలని హెయిర్ డ్రయ్యర్ వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువగా నీరు చేరే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకే చోటు వేడెక్కి మిగతా భాగాలను దెబ్బతీస్తాయి. మీ ఫోన్ సడెన్ గా నీళ్లలో పడితే ముందుగా పొడి బట్టతో ఫోన్ ను తుడవాలి అనంతరం చాలా సమయం వరకు ( సుమారు 12 గంటల వరకు ) స్మార్ట్ ఫోన్ ను వాడకూడదు. అలాగే కనీసం ఆరు గంటల పాటు బియ్యం బ్యాగులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ వేగంగా డ్రై అవుతుంది. అయితే బియ్యం గింజలు హెడ్ ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్టులోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఫోన్లో ఉండే సిమ్ కార్డ్ ట్రేలను తీసేయాలి. ఫోన్ పూర్తిగా ఆరిపోయిన తర్వాతే దాన్ని మళ్లీ ఆన్ చేయండి. ఫోన్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత కూడా ఫోన్ లోపల కొంత తేమ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ మునుపటిలా సరిగ్గా పని చేయకపోతే.. స్మార్ట్ ఫోన్ సర్వీస్ సెంటర్ లో చూపించాలి.
Also Read : Parkash Singh Badal: పంజాబ్ మాజీ సీఎంకు నివాళి.. దేశం అంతటా సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమా ఓపెనింగ్‌కు అతిధులుగా ఇద్దరు మంత్రులు
-
Divya Agarwal : బిగ్ బాస్ హౌస్‌లో మద్యం, సిగరెట్లు, బాత్రూమ్ సీక్రెట్స్ పై దివ్య అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!
-
Mukesh Ambani: షేర్ మార్కెట్ ‘సూపర్ కింగ్’గా ముకేశ్ అంబానీ.. అంబానీ తదుపరి టార్గెట్ అదేనా?
-
Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌పై ఆసీస్ క్లీన్‌స్వీప్.. బైక్‌పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
-
Love & war : మూవీ సెట్లో కార్మికుడి మృతి… 50 లక్షలు డిమాండ్
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!