ఫోన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోవడం లేదా వర్షంలో తడిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తమ ఫోన్ ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.