Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌కు తుఫాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ప్రస్తుతం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా, ఆ తర్వాత తీవ్ర తుఫానుగా, బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని అంచనా వేసింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తీరానికి చేరువగా తుఫాను కదలికలు
ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,010 కిలోమీటర్లు, బాపట్లకు 1,080 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న గంటల్లో ఇది మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత దాని తీవ్రత, కదలికలను బట్టి తీరప్రాంతాలపై ప్రభావం ఉండనుంది. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.
Also Read
- Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
- CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
- AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
- Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న 'అర్నాబ్'.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
సహాయక చర్యలకు 15 బృందాలు సిద్ధం
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు ముందస్తుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. మొత్తం 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లిలో ఒకటి, కాకినాడలో రెండు, కోనసీమలో రెండు, తూర్పుగోదావరిలో రెండు, ఏలూరులో రెండు, పశ్చిమగోదావరిలో ఒకటి, కృష్ణాలో ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, బాపట్లలో ఒకటి, అల్లూరిలో ఒకటి, పోలవరంలో ఒకటి చొప్పున బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అవసరాన్ని బట్టి సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, బోట్లు, వలలను భద్రంగా కట్టి ఉంచుకోవాలని సూచించారు. తీరప్రాంతాల్లో అలలు ఉద్ధృతంగా ఎగసిపడే అవకాశం ఉన్నందున సముద్రం వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకోవడం, ప్రమాదకర ప్రాంతాల్లో తిరగడం వంటి పనులు చేయవద్దని హెచ్చరించారు. మంగళ, బుధవారాల్లో ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
మూడు రోజులు వర్షాలే.. భారీ వర్షాలకు అవకాశం
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వాతావరణం మారనుంది. రేపు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉందని, ప్రవాహం ఉన్న చోట్ల వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. అధికారిక వాతావరణ బులెటిన్లు, స్థానిక యంత్రాంగం సూచనలను అనుసరించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది.
బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం#
గంటకు 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు#
సహాయక చర్యలకు 15 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం#
మూడు రోజులు భారీ వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!