IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
- జింబాబ్వేపై భారత్ 121 పరుగుల తేడాతో ఘన విజయం
- మూడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో భారత్ సిరీస్ కైవసం
- భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 328 పరుగులు
- 329 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 207 పరుగులకు ఆలౌట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND W vs ZIM W: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అద్భుత శతకాలతో భారత్ 328 పరుగుల భారీ స్కోరు సాధించగా.. అనంతరం బౌలింగ్‌లో వైష్ణవి శర్మ, దీప్తి శర్మ చెలరేగడంతో జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో జట్టు 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ప్రతీక రావల్ (61 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67) చక్కటి ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకుంది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (126 బంతుల్లో 15 ఫోర్లతో 121), దీప్తి శర్మ (86 బంతుల్లో 15 ఫోర్లతో 106 నాటౌట్) జింబాబ్వే బౌలర్లను ఉతికారేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఏకంగా 153 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మహిళల వన్డేల్లో భారత్ తరఫున ఐదో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 328 పరుగులు చేసింది.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
- UP Elections: యూపీలో ఒవైసీ-చంద్రశేఖర్ పొత్తు.. బీజేపీ హ్యాపీ, అఖిలేష్లో టెన్షన్.!
- Minister Ponguleti: 22A బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..
- Pat Cummins: ట్యాంపరింగ్ కలకలం.. పబ్లిక్‌లోనే భార్యతో గొడవ.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన..
329 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు ఏ దశలోనూ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ మోడెస్టర్ ముపాచిక్వా (49), చినో ముగేరి-తిరిపానో (46), బిజా (34) కాసేపు పోరాడినా.. భారీ లక్ష్యాన్ని ఛేదించే వేగంతో ఆడలేకపోయారు. మిడిలార్డర్లో కెప్టెన్ జోసెఫిన్ న్కోమో (22), న్యాషా గ్వాంజురా (20) పరుగులు చేసినప్పటికీ భారత కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు నిలవలేకపోయారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన జింబాబ్వే చివరకు 207 పరుగుల వద్ద కుప్పకూలింది. భారత బౌలర్లలో యువ బౌలర్ వైష్ణవి శర్మ అద్భుత ప్రదర్శన చేసింది. 10 ఓవర్లలో కేవలం 39 పరుగులిచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టింది. శతకంతో చెలరేగిన దీప్తి శర్మ బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేసింది. సయాలీ సాత్ఘరే, జింతిమణి కలిత, శ్రీ చరణి తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ కలిసి మొత్తం 535 పరుగులు నమోదు చేయగా.. భారత్-జింబాబ్వే మహిళల వన్డే చరిత్రలోనే ఇది అత్యధిక మ్యాచ్ అగ్రిగేట్ రికార్డుగా నిలిచింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2 – 0 ఆధిక్యాన్ని సాధించడంతో ఒక మిగిలి ఉండగానే సిరీస్ ను గెలిచింది. చివరి, మూడో వన్డే 28న జరగనుంది.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
-
Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
-
North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
-
UP Elections: యూపీలో ఒవైసీ-చంద్రశేఖర్ పొత్తు.. బీజేపీ హ్యాపీ, అఖిలేష్లో టెన్షన్.!
-
Minister Ponguleti: 22A బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!