8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
- హానర్ కొత్త Honor Pad X10 Mini ట్యాబ్లెట్‌ను చైనాలో విడుదల
- 9.7 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
- స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor Pad X10 Mini: హానర్ (Honor) నుండి సరికొత్తగా ‘Honor Pad X10 Mini’ పేరుతో కాంపాక్ట్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ట్యాబ్లెట్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. మెటల్ బాడీ, భారీ బ్యాటరీ, ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించిన ఎడ్యుకేషనల్ ఫీచర్లతో వస్తున్న ఈ ట్యాబ్లెట్ ప్రారంభ ధర 1,099 యువాన్లు (సుమారు రూ. 13,800 లేదా $165)గా నిర్ణయించారు. ఇందులో 9.7-అంగుళాల LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది 2052×1152 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పాటు 100% sRGB కలర్ కవరేజీని అందిస్తుంది. భద్రత కోసం స్క్రీన్‌పై సెకండరీ స్ట్రెంగ్త్ గ్లాస్ రక్షణను అందించారు. ఆల్-మెటల్ యూనిబాడీ డిజైన్‌తో రూపొందించిన ఈ ట్యాబ్లెట్ 8.48 మిమీ మందం, 477 గ్రాముల బరువు ఉంటుంది. ఇది SGS ఫైవ్-స్టార్ గోల్డ్ డ్రాప్ మరియు ప్రెజర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో పాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలను కూడా కలిగి ఉంది.
ఈ ట్యాబ్లెట్లో స్నాప్‌డ్రాగన్ 685 (Snapdragon 685) ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకునే సదుపాయం ఉంది. రోజువారీ మల్టీటాస్కింగ్, చదువు, వినోద అవసరాలకు ఈ ప్రాసెసర్ తగిన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇంకా దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ కోసం ఇందులో 8,000mAh బ్యాటరీని అందించారు. ఇది 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 82 రోజుల స్టాండ్‌బై, 122 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లేదా 16 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. వీడియో కాల్స్ మరియు ఫొటోల కోసం ముందు, వెనుక వైపులా 5MP కెమెరాలను అందించారు. మెరుగైన ఆడియో అనుభవం కోసం డ్యూయల్ స్పీకర్లను అమర్చారు.
Also Read
- Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
- WhatsApp New Update: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. కొత్త ఫీచర్ వివరాలివే!
- Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్‌తో అదిరిపోయే ఫీచర్లు!
- OnePlus Turbo 7 Pro 5G: 10,000mAh బ్యాటరీతో OnePlus కొత్త 5G ఫోన్.. 200MP కెమెరా, 100W ఛార్జింగ్!
చిన్న పిల్లలు, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని హానర్ ఈ ట్యాబ్లెట్లో ప్రీ-స్కూల్ కంటెంట్‌ను పొందుపరిచింది. ఇందులో ‘ఆక్టోనాట్స్’ (Octonauts) థీమ్ వనరులు, 2,000 కంటే ఎక్కువ పిల్లల పాటలు, 17,000కి పైగా యానిమేటెడ్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇది పిల్లల చదువుకు, కాలక్షేపానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. Honor Pad X10 Mini రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ 1,099 యువాన్లు కాగా, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను 1,399 యువాన్లుగ నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వై-ఫై మోడల్ ‘స్టారీ గ్రే’ (Starry Grey) రంగులో లభిస్తోంది. రిటైల్ బాక్స్‌లో ఛార్జర్, USB-C కేబుల్, క్విక్ స్టార్ట్ గైడ్ మరియు సిమ్ ఎజెక్టర్ టూల్ లభిస్తాయి. హానర్ అధికారిక ఆన్లైన్ స్టోర్‌తో పాటు JD.com వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఇది ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Indiramma Family Life Insurance: తెలంగాణ కుటుంబాలకు రేవంత్ సర్కార్ భరోసా.. కొత్త బీమా పథకం షురూ
-
Healthy Breakfast: ఈ చలికాలంలో తప్పకుండా తినాల్సిన హెల్దీ బ్రేక్‌ఫాస్ట్! 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..
-
AP-Tamil Nadu: తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఏపీకి లీక్.? 15 మంది అధికారులపై విజయ్ సర్కార్ వేటు..
-
CM Revanth Reddy : సిద్దిపేటలో కేసీఆర్‌కు రేవంత్ సవాల్.. మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!