CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
- బ్యారేజీ ఎత్తు 152 మీటర్లకు పెంచడంపై చర్చలు
- మహారాష్ట్రతో ఒప్పందం కోసం సీఎం ప్రత్యేక చొరవ
- కేంద్ర జలశక్తి శాఖ జోక్యంతో ముందుకు కదిలిన ప్రక్రియ
- ఉత్తర తెలంగాణ రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే చారిత్రక ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. గతంలో ఒప్పందాల దశలోనే నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ఆయన చేపట్టిన చర్యలు ఇప్పుడు తుది దశకు చేరాయి. ఇందులో భాగంగానే సోమవారం ముంబై వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వంతో బ్యారేజీ ఎత్తుపై అత్యంత కీలకమైన చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఇప్పటివరకు సాగించిన ప్రయాణంపై ప్రత్యేక కథనం.
గత నిర్లక్ష్యం నుంచి పునరుజ్జీవం వైపు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని గతంలో పక్కనపెట్టడంతో ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల రైతులకు ఆశించిన స్థాయిలో నీరు అందలేదు. 2016 ఆగస్టు 23న అప్పటి ప్రభుత్వం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంలో తుమ్మిడిహెట్టి నీటిమట్టాన్ని కేవలం +148 మీటర్లకు మాత్రమే పరిమితం చేసింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన గత పాలకులు తుమ్మిడిహెట్టిని పూర్తిగా విస్మరించారు. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించే బృహత్ సంకల్పంతో ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రావిటీ ద్వారా ఎక్కువ నీటిని తరలించాలంటే 148 మీటర్ల ఎత్తు సరిపోదని భావించి, +152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించేలా మహారాష్ట్రను ఒప్పించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రచించారు.
Also Read
దశలవారీగా ప్రణాళికలు.. కేంద్రంపై ఒత్తిడి
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేశారు. 2025 డిసెంబర్ 4న ఆదిలాబాద్‌లో జరిగిన ప్రజా విజయోత్సవాల వేదికగా, అలాగే 2026 జనవరిలో నిర్మల్ సభలో తుమ్మిడిహెట్టి నిర్మాణం చేపట్టి తీరుతామని ఆయన స్పష్టమైన హామీనిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 29న అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కార్యాచరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. మే 6న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర సీఎంకు లేఖ రాయగా, మే 26న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం వంటి అంశాలపై చర్చల ద్వారా పరిష్కరించుకుందామని కోరారు.
రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరని నేపథ్యంలో, జూన్ 11న ప్రధానికి లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన పీఎంవో జల్‌శక్తి శాఖకు బాధ్యతలు అప్పగించగా.. ఆగస్టు 5న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి తుమ్మిడిహెట్టి ఆవశ్యకతను వివరించారు. పూణె సీడబ్ల్యూపీఆర్ఎస్ (CWPRS) నిర్వహించిన బ్యాక్‌వాటర్ అధ్యయనాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ముంబై వేదికగా తుది దశ చర్చలు
ముఖ్యమంత్రి పట్టుదల కారణంగా సెప్టెంబర్ 1న కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ అధ్యక్షతన ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల మధ్య అంతర్రాష్ట్ర సమావేశం విజయవంతంగా జరిగింది. సెప్టెంబర్ 3న పూణె సీడబ్ల్యూపీఆర్ఎస్ రూపొందించిన బ్యాక్‌వాటర్ అధ్యయనాలు, వివిధ నీటిమట్టాల వద్ద ముంపు ప్రభావాన్ని చూపే కాంటూర్ మ్యాప్‌లను మహారాష్ట్ర జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. ఈ వరుస కసరత్తుల ఫలితంగానే సోమవారం ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై అత్యంత కీలకమైన చర్చలు జరపడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం ముంబైకి పయనం అయింది. ఈ భేటీతో తుమ్మిడిహెట్టి రూపంలో ఉత్తర తెలంగాణ రైతులకు అందాల్సిన నీటి హక్కులు త్వరలోనే సాకారమవుతాయని సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
ట్రెండింగ్
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?