Samsung TV Plus: భారతదేశంలో ఉచితంగా అందుబాటులో ఉన్న యాడ్స్ ఆధారిత స్ట్రీమింగ్ టీవీ సేవ శాంసంగ్ టీవీ ప్లస్ తన కంటెంట్ లైబ్రరీని మరింత విస్తరించింది. తాజాగా ఈ సేవలో ఈనాడు టెలివిజన్ (ETV Network) నుంచి నాలుగు కొత్త ఛానెల్స్‌ను చేర్చినట్లు ప్రకటించింది. దీంతో శాంసంగ్ టీవీ ప్లస్‌లో అందుబాటులో ఉన్న FAST ఛానెల్స్ సంఖ్య 150 దాటింది.
HMDA: భూముల వేలానికి సిద్ధమైన ప్రభుత్వం.. హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల
ఈటీవీ నెట్‌వర్క్ దేశంలో ప్రముఖ ప్రసార సంస్థ. ఇది వార్తలు, సంగీతం, యువత కోసం వినోదం, కామెడీ వంటి విభిన్న కంటెంట్‌ను అందిస్తోంది. కొత్తగా చేర్చిన ఈ ఛానెల్స్ ద్వారా శాంసంగ్ టీవీ ప్లస్‌లో ప్రాంతీయ భాషా కంటెంట్, కళలు, సంగీత విభాగాలు మరింత బలోపేతం కానున్నాయి. సంస్థ ప్రకటన ప్రకారం ఈ భాగస్వామ్యం ద్వారా భాషా, భౌగోళిక అడ్డంకులను అధిగమించి, వినియోగదారులకు విభిన్న కంటెంట్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Horoscope Today: బుధవారం దినఫలాలు.. ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు!
సాంప్రదాయ టెలివిజన్ ప్రసార సంస్థ అయిన ఈటీవీ నెట్‌వర్క్, ఆధునిక స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫామ్ శాంసంగ్ టీవీ ప్లస్‌తో కలిసి పనిచేయడం చూస్తే భారతదేశంలో వేగంగా మారుతున్న డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్ రంగానికి ఒక ముఖ్యమైన దిశానిర్దేశంగా చెప్పవచ్చు.