Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Launches Certified Re-Newed Program: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) భారత మార్కెట్లో కొత్తగా ‘సర్టిఫైడ్ రీ-న్యూడ్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రిఫర్బిష్డ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులకు తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌లో ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S25 సిరీస్‌తో పాటు మిడ్ రేంజ్ వినియోగదారులకు చెందిన గెలాక్సీ A సిరీస్ మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ కింద అందిస్తున్న అన్ని స్మార్ట్‌ఫోన్లు పూర్తిస్థాయి పరీక్షలు, సాఫ్ట్‌వేర్ ధృవీకరణ, పనితీరు తనిఖీల తర్వాత మళ్లీ రీ-న్యూడ్ చేయబడతాయని శాంసంగ్ తెలిపింది. అంతేకాదు కొత్త ఫోన్లకు ఇచ్చే విధంగానే ఒక సంవత్సరం వారంటీ కూడా ఈ ఫోన్లకు అందిస్తున్నారు.
శాంసంగ్ ప్రకారం, ఈ ఫోన్లను పూర్తిగా ఒరిజినల్ శాంసంగ్ పార్ట్స్‌తోనే మరమ్మతులు చేసి, కొత్త బాక్స్‌లో ప్యాక్ చేసి అందిస్తున్నారు. బాక్స్‌లో డేటా కేబుల్, ఈజెక్టర్ పిన్, క్విక్ స్టార్ట్ గైడ్ కూడా ఉంటాయి. అలాగే వినియోగదారుల పాత డేటాను పూర్తిగా తొలగించిన తర్వాతే ఫోన్లను మళ్లీ విక్రయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇంకా ముఖ్యంగా ఈ రిఫర్బిష్డ్ ఫోన్లకు తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు అందుబాటులో ఉంటాయని, ఏ నెట్‌వర్క్ సిమ్‌కైనా అనుకూలంగా పనిచేస్తాయని శాంసంగ్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోన్లు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, శాంసంగ్ షాప్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
Also Read
- Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్‌ప్లే
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్‌ప్లే
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
మిడ్ రేంజ్ వినియోగదారులకు చెందిన Samsung Galaxy A56 12GB + 256GB వేరియంట్ ధర రూ.32,749గా నిర్ణయించారు. కొత్త ఫోన్ ధర రూ.44,999. ఇక Samsung Galaxy A36 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ.23,249కి అందిస్తున్నారు. దీని అసలు ధర రూ.32,999. ఇక మరోవైపు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ కలిగిన రిఫర్బిష్డ్ Samsung Galaxy S25 Ultra ధర రూ.97,499గా నిర్ణయించారు. ఇదే ఫోన్ కొత్తది కొనుగోలు చేస్తే రూ.1,29,999 ఖర్చవుతుంది. అలాగే 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ గల Samsung Galaxy S25 రీ-న్యూడ్ మోడల్ ధర రూ.58,749గా ఉంది. కొత్త ఫోన్ ధర రూ.62,999.
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్‌ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!