Samsung India: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత అధిక ఆదాయం ఈ సంవత్సరం సమకూరింది. ఇతర ఆదాయం ఏకంగా 78 శాతం (రూ.2873.20 కోట్లకు) పెరగటంతో ఈ వృద్ధి నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.75,886 కోట్లు కాగా ఈసారి రూ.82,451 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే.. గతేడాది కన్నా ఇప్పుడు 8.65 శాతం గ్రోత్ సాధించింది. ఇదిలాఉండగా శామ్‌సంగ్ ఇండియాకి నెట్ ప్రాఫిట్…