Samsung Galaxy Z Fold 8: శాంసంగ్ గెలాక్సీ Z సిరీస్ ఫోల్డబుల్ ఫోన్లను ఈ ఏడాది కూడా విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. 2026కు సంబంధించిన Galaxy Z Fold 8, Galaxy Z Flip 8 మోడల్స్ తాజాగా GSMA IMEI డేటాబేస్లో కనిపించాయి. దీంతో ఈ ఫోన్ల అభివృద్ధి ఇప్పటికే ప్రారంభ దశలో ఉన్నట్టు స్పష్టమవుతోంది.
Read Also: Naga Chaitanya: 2025 నాకెంతో ప్రత్యేకం.. ఆనందంలో నాగ చైతన్య!
IMEIలో లిస్టింగ్..
* Galaxy Z Fold 8 → మోడల్ నంబర్ SM-F976U, కోడ్‌నేమ్ Q8
* Galaxy Z Flip 8 → మోడల్ నంబర్ SM-F776U, కోడ్‌నేమ్ B8.. కాగా, ఈ మోడల్ పేర్లలో చివర ఉన్న ‘U’ అక్షరం ఇవి అమెరికా మార్కెట్ కోసం రూపొందుతున్న వేరియంట్లుగా సూచిస్తుంది. సాధారణంగా శాంసంగ్ గ్లోబల్ మోడళ్లకు ‘B’ సఫిక్స్ ను ఉపయోగిస్తుంది. ఈ లిస్టింగ్ శాంసంగ్ తన Z సిరీస్‌కు ఉన్న పేర్ల సంప్రదాయాన్ని కొనసాగించబోతోందని కూడా ధృవీకరిస్తోంది.
Read Also: Amaravati: ల్యాండ్ పూలింగ్లో మంత్రిని నిలదీసిన రైతులు.. చట్టబద్ధత ఎక్కడ, అభివృద్ధి ఏదీ..?
మూడో మిస్టరీ ఫోల్డబుల్?
అయితే, Z Fold 8, Flip 8 మాత్రమే కాదు.. శాంసంగ్ నుంచి ఈ ఏడాది మూడో ఫోల్డబుల్ డివైస్ కూడా రానుందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత నెలలో SM-F971U మోడల్ నంబర్‌తో, ‘H8’ అనే కోడ్‌నేమ్‌తో మరో ఫోల్డబుల్ IMEIలో కనిపించింది. ఇది Samsung ఫోల్డబుల్ వ్యూహంలో కొత్త విభాగానికి చెందిన ఫోన్ అయ్యే అవకాశం ఉందని అంచనా. అయితే, టెక్ నిపుణుల సమాచారం ప్రకారం, ఈ డివైస్ Galaxy Z Fold 8 ‘Wide’ వేరియంట్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆపిల్ త్వరలో తీసుకురాబోతున్న ఫోల్డబుల్ iPhoneకు పోటీగా శాంసంగ్ ఈ “Wide” మోడల్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Also: Theft: కేపిహెచ్ బిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో.. రూ.50 లక్షలు విలువైన వెండి ఆభరణాలు చోరీ
భారీ అప్‌గ్రేడ్లు!
* Galaxy Z Fold 8లో 5,000mAh బ్యాటరీ
* టెలీఫోటో, అల్ట్రావైడ్ కెమెరాల్లో మెరుగైన సెన్సార్లు
* Galaxy Z Fold 7తో పోలిస్తే 10% సన్నగా, తేలికగా
* S Pen స్టైలస్ సపోర్ట్
* వేగవంతమైన ఛార్జింగ్
* స్క్రీన్ మడత వద్ద దాదాపు కనిపించని క్రీజ్
* ఫోల్డ్ చేసిన తర్వాత కూడా డిస్‌ప్లే స్మూత్‌గా ఉండేలా కొత్త హింజ్ టెక్నాలజీ
లాంచ్ జూలైలోనే!
శాంసంగ్ ఇప్పటి వరకు 2026 ఫోల్డబుల్ లైనప్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినా, కంపెనీ గతంలో అనుసరించిన షెడ్యూల్‌ను పరిశీలిస్తే, ఈ ఏడాది కూడా జూలై 2026లోనే కొత్త ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. మరిన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా, శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. ఈసారి Reasoning AI, కొత్త ఫార్మ్ ఫాక్టర్లు కూడా ఫోల్డబుల్ ఫోన్ల భవిష్యత్తును మార్చబోతున్నాయా? అనే దాని గురించి వేచి చూడాల్సిందే!