కేపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్ లోని ఆలయం లో భారీ చోరీ చోటుచేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లోని మూలవిరాట్ కు సంబంధించిన ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. సుమారు రూ.50 లక్షలకు పైగా విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గుర్తించారు. తెల్లవారుజామున రోజు వారిలానే ఆలయాన్ని తెరిచి పూజ చేసే క్రమంలో గుర్తించిన పూజారులు. వెంటనే కేపి.హెచ్.బి పోలీసులకు సమాచారం అందించారు ఆలయ నిర్వాహకులు. ఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు పోలీసులు. ఘటన పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.