2025 తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచిందని హీరో నాగ చైతన్య అన్నారు. ‘తండేల్’ సినిమా తన సినీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పారు. తన కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తన తొలి చిత్రంగా తండేల్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. కొత్త ఏడాదిలో తన లైఫ్‌లో ఎన్నో ఉత్తేజకరమైన పరిణామాలు జరగనున్నాయన్నారు. నటుడిగా కొత్త కథలను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కథల ఎంపిక విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటానని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.
‘2025 నాకు చాలా ముఖ్యమైన సంవత్సరం. తండేల్ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడమే కాకుండా.. ఓటీటీ డీల్‌లోనూ రికార్డులు సృష్టించింది. నా కెరీర్‌లో థియేటర్‌లో తండేల్, ఓటీటీలో దూత పెద్ద మార్పు తీసుకొచ్చాయి. ప్రస్తుతం నా 25వ చిత్రం ‘వృషకర్మ’తో బిజీగా ఉన్నా. ఇప్పటివరకు చేయని కొత్త తరహా కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ఈ కొత్త సంవత్సరంలో నా జీవితంలో ఎన్నో ఉత్తేజకరమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. కుటుంబంతో కలిసి ఆ క్షణాలను ఆస్వాదిస్తూ.. నటుడిగా కొత్త కథలను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కథల ఎంపిక విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటా’ అని నాగ చైతన్య చెప్పారు.
Also Read: Joe Root Mission 15921: మిషన్ 15921.. జో రూట్ రోడ్ మ్యాప్, 2027లో సచిన్ రికార్డు బ్రేక్!
వృషకర్మ చిత్రంలో వీఎఫ్‌ఎక్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని నాగ చైతన్య తెలిపారు. ఇందులో తాను నిధి అన్వేషకుడిగా, గాఢతతో కూడిన కీలక పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. పురాణాలు, చరిత్రను మేళవించి భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చై చెప్పుకొచ్చారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ, థాంక్యూ చిత్రాలు నిరాశపరిచాయి. మంచి హిట్ కోసం ఎదురుచూసిన నాగ చైతన్య.. 2023లో ‘దూత’తో ఓటీటీలోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నారు. గతేడాది విడుదలైన ‘తండేల్’తో భారీ హిట్‌ను అందుకున్నారు. చై కెరీర్‌లో కొత్త ఊపు వచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి.