Redmi 15 5G: నేడు (ఆగస్టు 19) రెడ్మీ 15 5G భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇప్పటికే షావోమి సబ్ బ్రాండ్ ఈ ఫోన్‌పై పలు కీలక ఫీచర్లను టీజ్ చేసింది. ఈ మొబైల్ లో ముఖ్యంగా 7,000mAh భారీ బ్యాటరీ, 18W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 144Hz డిస్‌ప్లే, AI ఆధారిత 50MP డ్యుయల్ రియర్ కెమెరా వంటి అద్భుత ఫీచర్స్ ఇందులో ఉండనున్నట్లు ధృవీకరించబడింది.
ఫోన్ అధికారిక ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే మలేసియాలో ఈ మోడల్ ధర MYR 729 అంటే సుమారు రూ.15,000 వద్ద ఉండవచ్చు. అందువల్ల భారత్‌లో కూడా ఈ ఫోన్ ధర సుమారు రూ.15,000 పరిధిలోనే ఉండే అవకాశం ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్ ఫ్రొస్టెడ్ వైట్, మిడ్ నైట్ బ్లాక్, శాండీ పర్పుల్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇప్పటికే ఈ మొబైల్ కోసం అమెజాన్ ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా లైవ్ చేసింది.
Telangana Floods: తెలంగాణలో కొనసాగుతున్న వరద ఉధృతి.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవులు

రెడ్మీ 15 5G 6.9 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో రానుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 288Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో మరింత స్మూత్ అనుభవాన్ని అందించనుంది. అలాగే, Wet Touch Technology 2.0 సపోర్ట్ ఉండటం వలన తడి చేతులతో కూడా సులభంగా ఫోన్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రాసెసింగ్ పనితీరు కోసం Qualcomm Snapdragon 6s Gen 3 చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించారు. మెమరీ, స్టోరేజ్ పరంగా ఈ డివైస్ గరిష్టంగా 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో అందుబాటులోకి రానుంది.

ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HyperOS 2.0 తో నడుస్తుంది. ఇక కెమెరా సెటప్‌లో 50MP AI ఆధారిత డ్యుయల్ రియర్ కెమెరా యూనిట్ ఉండగా, దీనికి 2MP సెకండరీ సెన్సార్ తోడవుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడనుంది. బ్యాటరీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh భారీ సామర్థ్యంతో కూడిన బ్యాటరీను అమర్చారు. అలాగే దీనికి 18W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కల్పించారు. దీని ద్వారా మరో ఫోన్ లేదా IoT పరికరాలను ఛార్జ్ చేయవచ్చు.
Dowry Harassment: వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..!

ఇక మొబైల్ పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్ ఒకసారి ఛార్జ్ చేస్తే Spotifyలో సుమారు 55.6 గంటల పాటు మ్యూజిక్ స్ట్రీమింగ్, YouTubeలో 23.5 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్, BGMIలో 12.7 గంటల వరకు గేమ్‌ప్లే అందించగలదని కంపెనీ ఛేబ్బుతోంది. మొత్తంగా భారీ బ్యాటరీ, మంచి డిస్‌ప్లే, 5G సపోర్ట్ కలయికతో Redmi 15 5G మధ్యస్థాయి స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో బలమైన పోటీని ఇవ్వనుంది.
