Instagram New Feature : ఇన్‌స్టాలో కొత్త ఫీచర్.. అదుర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన వినియోగదారుల కోసం ఇన్స్టాగ్రామ్ మరో కొత్తీ ఫీచర్‌ను తీసుకురానుంది. తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు మెటా సంస్థ మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్ల వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మారుతాయి. మెటా సంస్థ ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. “ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అనుభూతిని మరింత సులభతరం చేయడంతోపాటు, మెరుగుపరచాలనే ఉద్దేశంతో వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చే ఫీచర్‌ను పరీక్షిస్తున్నాం” అని మెటా సంస్థ వెల్లడించింది. పబ్లిక్ ఖాతాలో అప్లోడ్ చేసిన వీడియోలు రీల్స్‌గా మారినప్పుడు ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఎవరైనా సదరు రీల్స్‌లోని ఆడియో, వీడియో క్లిప్‌లను వేరువేరుగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేటు ఖాతాల్లో వీడియో-రీల్స్ కేవలం ఖాతాను ఫాలో అవుతున్న వారికి మాత్రమే కనిపిస్తాయని తెలిపింది మెటా సంస్థ. గత రెండేళ్లుగా షార్ట్ వీడియోలను చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ నేపథ్యంలో షార్ట్ వీడియోలను యూజర్లకు చేరువచేయాలనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. అయితే.. ఇప్పటికే వయసు ధ్రువీకరణ కోసం సెల్ఫీ వీడియో, సోషల్ వోచింగ్ ఫీచర్లను ఇన్‌స్టా తీసుకొస్తుంది. అంతకముందు యూజర్ల కోసం అవతార్ ఫీచర్‌ను పరిచయం చేసింది ఇన్‌స్టా. అయితే ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు చేరువయ్యేందుకు మరిన్ని ఫీచర్లను మున్ముందు ప్రవేశపెట్టనున్నట్లు ఇన్‌స్టా తెలిపింది. అంతేకాకుండా.. గత రెండు సంవత్సరాలుగా ఇన్‌స్టా వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని తెలిపింది.
Also Read
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..