Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు, రాళ్ల దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి జరిగింది. 21వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో ఆమెపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు పులివెందులలోని 11, 12వ పోలింగ్ కేంద్రాల సమీపంలో రాళ్ల దాడి జరిగింది. 1, 2వ వార్డుల్లో ఓటు వేసేందుకు వెళ్తున్న మహిళలను అడ్డుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఓటర్ స్లిప్పులను లాక్కుంటున్నారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. 8, 9, 10వ వార్డుల్లో కూడా ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని అడ్డుకుంటున్నారని పలువురు నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలీసుల సమక్షంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
- AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
- Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
38వ వార్డు పరిధిలోని సరస్వతి విద్యామందిర్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడ టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడినట్లు వైసీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. 18వ వార్డు యర్రగుడిపల్లి వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరగగా.. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. వరుస ఘటనలతో పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
-
AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!