Ingenuity: అంగారకుడిపై చరిత్ర సృష్టించిన నాసా ‘ఇన్‌జెన్యూనిటీ’ హెలికాప్టర్ తన ప్రస్థానాన్ని ముగించింది. రోబోట్ హెలికాప్టర్ లోని ఒక రోటర్ విరిగిపోవడంతో ఇక అది పైకి ఎగరలేదని నాసా తెలిపింది. జనవరి 18న చివరిసారిగా తన 72వ ఫ్లైట్ తర్వాత పాడైపోయింది. దీనిని నాసా జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ రూపొందించింది. అనుకున్న దానికన్నా ఎక్కువ సార్లు, విజయవంతంగా అంగారకుడి వాతావరణంలో ఇది అద్భుతంగా పనిచేసింది.