OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
- 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్
- 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus 13s New 16GB Variant: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus భారత మార్కెట్లో OnePlus 13s సిరీస్‌లో కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు 12GB RAM వరకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు 16GB RAM + 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తోంది. దీని ధరను కంపెనీ రూ.68,999గా నిర్ణయించింది. కొత్త వేరియంట్లో పవర్ ఫుల్ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్, 50MP డ్యూయల్ కెమెరాలు, 5,850mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర, వేరియంట్లు
RAM- స్టోరేజ్ -ధర
12GB 256GB రూ.54,999
12GB 512GB రూ.59,999
16GB 512GB రూ.68,999
Also Read
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
కొత్త 16GB RAM వేరియంట్‌ను Amazonతో పాటు OnePlus అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు
కొత్త OnePlus 13s కొనుగోలుపై పలు బ్యాంక్ కార్డులతో రూ.2,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. HDFC, ICICI, Kotak, IDFC First, IndusInd Bank క్రెడిట్ కార్డులకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. అయితే ఆఫర్ల నిబంధనలు, చెల్లుబాటు వివరాలు కొనుగోలు సమయంలో చెక్ చేయాలి.
OnePlus 13s మూడు రంగుల్లో లభిస్తుంది.. Black Velvet, Green Silk, Pink Satin. OnePlus 13sలో 6.32-అంగుళాల 1.5K LTPO ProXDR AMOLED డిస్ప్లే ఉంది. ఇది 2,640 × 1,216 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్ప్లేలో 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1,600 nits బ్రైట్నెస్, Aqua Touch 2.0, 2,160Hz PWM dimming వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో కంటెంట్ మరింత స్మూత్‌గా ఉండేలా డిస్ప్లేను రూపొందించారు.
Snapdragon 8 Eliteతో మంచి పనితీరు
ఫోన్‌కు Qualcomm Snapdragon 8 Elite చిప్సెట్ పవర్ అందిస్తుంది. కొత్త టాప్ వేరియంట్లో 16GB LPDDR5X RAM, 512GB UFS 4.0 స్టోరేజ్ ఉన్నాయి. హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులకు ఈ హార్డ్‌వేర్ ఉపయోగపడుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5G, 4G LTE, Wi-Fi 7, Bluetooth 6.0, GPS, NavIC, NFC, USB Type-C పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
50MP డ్యూయల్ రియర్ కెమెరాలు
ఫోటోగ్రఫీ కోసం OnePlus 13sలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. 50MP Sony LYT-700 ప్రైమరీ కెమెరా – OIS, f/1.8 అపెర్చర్, 50MP టెలిఫోటో కెమెరా – 2x ఆప్టికల్ జూమ్, f/2.0, EIS, 32MP ఫ్రంట్ కెమెరా – f/2.0 అపెర్చర్. ప్రైమరీ కెమెరాలో OIS ఉండటం వల్ల తక్కువ వెలుతురు పరిస్థితుల్లోనూ, చేతి కదలికల వల్ల వచ్చే బ్లర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
5,850mAh బ్యాటరీ.. 80W ఫాస్ట్ ఛార్జింగ్
OnePlus 13sలో 5,850mAh బ్యాటరీ అందించారు. దీనికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అదనంగా ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఫోన్ పరిమాణం 150.8 × 71.7 × 8.2mm, బరువు సుమారు 185 గ్రాములు. Snapdragon 8 Elite వంటి ఫ్లాగ్షిప్ చిప్సెట్, 16GB RAM ఉన్నప్పటికీ ఫోన్‌ను కాంపాక్ట్‌గా ఉంచడం OnePlus 13sలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!