తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే MarQ M3 స్మార్ట్ ఫోన్‌పై ఓ లుక్కేయండి. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో ఈ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ 6.088 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా 5000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. మరోవైపు ఈ స్మార్ట్ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్‌తో పాటు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మెమొరీ కార్డు సహాయంతో ఈ ఫోన్ స్టోరేజ్‌ను 256 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.
ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్ క్వాలిటీ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్‌లో నైట్ మోడ్, బ్యూటీ మోడ్, స్లో మోషన్, టైమ్‌లాప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. రూ.7,999 ధర కలిగిన ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.5,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ ఆదివారంతో ముగియనుంది. కాబట్టి ఇప్పుడే త్వరపడి ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయండి. ఈ సేల్‌లో షాపింగ్ చేస్తే కొటక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు.