ఎలెక్ట్రానిక్ వస్తువులను క్లీన్ చేసేవాళ్ళు కొన్ని చిన్న టిప్స్ పాటించకుంటే మాత్రం భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది..ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ను క్లీన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ప్రస్తుతం అయితే కొత్త టెక్నాలజీతో అడ్వన్స్‌డ్‌గా కొత్త ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త జనరేషన్‌లో విడుదలవుతున్నాయి. అయితే ల్యాప్‌టాప్‌ను వాడకంతో కూడా కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా వాడినట్లయితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.. దుమ్ము దూళి నుంచి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.. లేకుంటే పాడయిపోతుంది..
ఈ ల్యాప్ టాప్ ల స్క్రీన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఒత్తిడి లేదా రసాయనాల వాడకం స్క్రీన్‌ను దెబ్బతీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో స్క్రీన్ క్లీన్ చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. లేకపోతే వేలల్లో నష్టపోతారు. ల్యాప్‌టాప్‌లను వాడేటప్పుడు చుట్టుపక్కల ఎలాంటి ఇబ్బందికరమైన వస్తువులను ఉండకుండా చూడాలి. ఏదైనా వస్తువు ల్యాప్‌టాప్‌కు తగిలినట్లయితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఈ ల్యాప్ టాప్ ను క్లీన్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్క్రీన్ లను క్లీన్ చేసే సమయంలో ఎక్కువగా రసాయనాలను వాడోద్దని నిపుణులు చెబుతున్నారు.. స్క్రీన్ నుంచి ధుమ్మును తొలగించడానికి ఏ రకమైన స్ప్రేని ఉపయోగించవద్దు. ఎందుకంటే ల్యాప్‌టాప్ హార్డ్‌వేర్ దెబ్బతింటుంది.స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి ఆల్కహాల్ లేదా ఏదైనా రసాయనాలను ఉపయోగించవద్దు.. ఎంతసేపు మెత్తని కాటన్ గుడ్డతో వీటిని క్లీన్ చెయ్యడం మంచిది.. ఇక స్క్రీన్ ను శుభ్రపరిచేటప్పుడు ఒత్తిడి కారణంగా స్క్రీన్‌పై గీతలు పడకుండా, దెబ్బతినకుండా మీ చేతులతో సున్నితంగా ఉండండి. స్క్రీన్ మరకగా ఉంటే, ముందుగా పొడి గుడ్డతో స్క్రీన్ ను శుభ్రం చేయండి. అప్పుడు మీరు స్క్రీన్‌ను కొద్దిగా తడి గుడ్డతో తుడవవచ్చు. అయితే లోపలికి నీరు చేరకుండా జాగ్రత్తపడాలి. తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని క్లీన్ చెయ్యాలి..