కర్ణాటకలో ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ వివాదం నడుస్తోంది. మొన్నటిదాకా హస్తిన వేదికగా చర్చలు నడవగా.. ప్రస్తుతం బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. గత శనివారం సిద్ధరామయ్య ఇంట్లో డీకే.శివకుమార్ అల్పాహారం తీసుకోగా.. మంగళవారం డీకే.శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్ చేశారు.

అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని.. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లుగా తెలిపారు. ఇక ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. ఇద్దరం ఐక్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా ఇలానే కలిసి ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పుకొచ్చారు. కర్ణాటక ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా ఉన్నారని, ప్రతిపక్షాలను కలిసి ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి అన్నారు. ఇక డీకే.శివకుమార్ ఇంట్లో నాటుకోడి చికెన్, ఇడ్లీలను సిద్ధరామయ్య తిన్నారు.
#WATCH | Bengaluru, Karnataka | When media asked CM Siddaramaiah when Dy CM DK Shivakumar will become Chief Minister, he says, "When the High Command says…" pic.twitter.com/gSer7e3hYd
— ANI (@ANI) December 2, 2025