స్టార్ హీరోయిన్ సమంత మరియు స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు సోమవారం ఘనంగా వివాహ బంధం లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట భూత శుద్ధి వివాహం చేసుకుంది. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఒక్క రోజులోనే లక్షల్లో లైక్స్, విషెస్ వర్షం కురిపించాయి. ఈ కొత్త జంటను పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు. అయితే, వివాహం తర్వాత సమంత కు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా విషయాలు షాక్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా,
Also Read : Janhvi Kapoor: నా తల్లి మరణాన్ని కూడా ఎగతాళి చేశారు – జాన్వీ కపూర్
సమంత పెళ్లి తర్వాత ఆమె పర్సనల్ మేకప్ స్టైలిష్ట్ సద్నా సింగ్ సామ్‌ను ఇన్ స్టాలో అన్ ఫాలో చేసి.. ‘బాధితురాలిగా విలన్ చాలా బాగా నటించింది’ అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా… ఆమె సామ్‌ను విలన్ అనేసిందా? అంటూ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీంతో నాగచైతన్య గత వీడియో వైరల్ అవుతుండగా ఆయనకు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. దీనికి తోడు..
హీరోయిన్ పూనమ్ కౌర్ సైతం చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం అంటూ ఆమె పోస్ట్ చేయగా ఇది పరోక్షంగా సమంతను ఉద్దేశించే చేశారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ‘ఈ అహంకారపూరిత మహిళలు పెయిడ్ పీఆర్ గొప్పగా చూపిస్తున్నారు. బలహీనమైన, నిరాశ చెందిన పురుషులను డబ్బుతో కొనవచ్చు’ అంటూ రాయగా.. పూనమ్ అంత మాట అనేసిందేంటి అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు మాత్రం ఆమె ట్వీట్‌పై విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇవ్వని మాటలు వింటున్న అభిమానులు సామ్ విషయంలో కాస్త గందరగోళంగా ఉన్నారు.