5G సపోర్ట్, బెస్ట్ ఫీచర్స్.. 7040mAh బ్యాటరీతో Samsung Galaxy Tab A11+ భారత్‌లో లాంచ్!
- శాంసంగ్ నుంచి కొత్త టాబ్లెట్ భారత్‌లో విడుదల
- శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ లాంచ్
- 5G సపోర్ట్, 7040mAh బ్యాటరీ, బెస్ట్ ఫీచర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ తన కొత్త టాబ్లెట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఏ సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్’ (Samsung Galaxy Tab A11+)ను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది Wi-Fi, 5G మద్దతుతో వచ్చింది. ఈ టాబ్లెట్ ప్రారంభ ధర రూ.22,999గా ఉంది. 7040mAh బ్యాటరీ, బెస్ట్ ఫీచర్స్ ఉన్న గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ రెండు రంగులలో విడుదల చేయబడింది: గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లు, అమెజాన్ సహా ఇతర ప్రధాన రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. Wi-Fi 6GB/128GB వేరియంట్ ధర రూ.22,999గా కంపెనీ ప్రకటించింది. రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. దాంతో బేస్ వేరియంట్ ధర రూ.19,999కి తగ్గుతుంది. 5G వేరియంట్ 6GB/128GBలో వస్తుంది. దీని ధర రూ.26,999గా ఉంది. రూ.3,000 బ్యాంక్ ఆఫర్ అనంతరం రూ.23,999కి అందుబాటులో ఉంటుంది.
Also Read
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ 11-అంగుళాల TFT LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ టాబ్లెట్ ఆక్టా-కోర్ MediaTek MT8775 (2.5GHz + 2GHz) 4nm ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 6GB లేదా 8GB RAM ఎంపికలతో వస్తుంది. స్టోరేజ్ ఆప్షన్లలో 128GB, 256GB ఉన్నాయి. మైక్రో SD కార్డ్‌తో 2TB వరకు విస్తరించవచ్చు. ఈ టాబ్లెట్ OneUI 8తో Android 16లో రన్ అవుతుంది. ఇందులో 8MP ఆటోఫోకస్ వెనుక కెమెరా సెన్సార్, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది Dolby Atmos మద్దతుతో డ్యూయల్ స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 25W అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జర్‌తో 7040mAh బ్యాటరీని కలిగి ఉంది.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!