ఆన్ లైన్ షాపింగ్ లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ ఈరోజు మార్చి 7న ప్రారంభమైంది. ఈ సేల్ చివరి మార్చి 13 వరకు కొనసాగనున్నది. అంటే ఈ సేల్ 7 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సేల్ లో తమ ప్రొడక్ట్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్స్ నుంచి మొదలుకొని టీవీల వరకు వేలల్లో డిస్కౌంట్ అందిస్తోంది. హోళీ పండగను పురస్కరించుకుని కొత్త వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఈ సేల్ లో ఐఫోన్ 16పై వేలల్లో డిస్కౌంట్ ప్రకటించింది.
Also Read:Keesara: విద్యార్థులను చితకబాదిన పీఈటీపై సస్పెన్షన్ వేటు..
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర గాడ్జెట్‌లపై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. షాపింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఫ్లిప్‌కార్ట్ HDFC, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read:Ranya Rao Case: నన్ను ట్రాప్ చేశారు, విచారణలో విలపించిన రన్యా రావు..
ఐఫోన్ 16 ధర రూ.79,900 కాగా, ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో రూ.68,999కి వచ్చేస్తోంది. ఈ ఐఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ.10,901 తగ్గింపును అందిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ద్వారా రూ. 4 వేలు, ఎక్స్ ఛేంజ్ బోనస్ ద్వారా రూ. 5 వేలు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే ఐఫోన్ 16ని రూ. 59,999కే దక్కించుకోవచ్చు. గెలాక్సీ S24ని రూ.52,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో నథింగ్ ఫోన్ 2ఎ, 2ఎ ప్లస్ లపై మంచి డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. రెండు ఫోన్‌లను వరుసగా రూ.19,999, రూ.25,499 కు కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, Moto Edge 50, Moto G85, Poco X6 Pro వంటి అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ అందుకోవచ్చు.