HONOR WIN, HONOR WIN RT: హానర్ (HONOR) సంస్థ HONOR WIN, HONOR WIN RT స్మార్ట్‌ఫోన్‌లను డిసెంబర్ 26న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త మోడళ్లు ఇప్పటివరకు ఉన్న HONOR GT సిరీస్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి రానున్నాయి. సంస్థ ప్రకారం WIN సిరీస్‌ను పూర్తిగా నెక్స్ట్-జెన్ గేమింగ్ పవర్‌హౌస్ గా డిజైన్ చేశారు. ఈ ఫోన్‌లు బ్లాక్, వైట్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. స్లీక్ కర్వ్ డిజైన్‌తో రూపొందించడంతో పాటు.. ఎక్కువ సేపు గేమింగ్ చేసినా చేతికి ఇబ్బంది లేకుండా గ్రిప్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది.
Gold Silver Rates: చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు.. ఇవాళ ఒక్కరోజే రూ.11 వేలు పెరిగిన సిల్వర్
ఇక మొబైల్ వెనుక భాగంలో మ్యాట్ ఫినిష్ ఉండటంతో చెమట వల్ల స్లిప్ కాకుండా ఉంటుంది. అంతేకాదు.. ప్రత్యేకంగా రూపొందించిన ప్రిసిషన్ ఇంజినీర్డ్ మిడ్-ఫ్రేమ్ ఆర్మర్ వల్ల గేమింగ్ సమయంలో కూడా ఫింగర్‌ప్రింట్స్ పడకుండా ఉంటాయని హానర్ పేర్కొంది. బయటకు వచ్చిన ఇమేజ్ ప్రకారం.. ఈ సిరీస్ ఫోన్‌ల వెనుక భాగంలో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ కనిపిస్తోంది. ఇది గేమింగ్ సమయంలో హీట్ కంట్రోల్‌కు చాలా ఉపయోగపడే ఫీచర్‌గా భావిస్తున్నారు.
HONOR WIN RTలో డ్యుయల్ రియర్ కెమెరాలు, HONOR WINలో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉండనున్నాయి. ఈ కెమెరాలను మ్యాట్రిక్స్ కెమెరా డెకో డిజైన్లో అమర్చారు. వీటితోపాటు కుడి వైపు ప్రత్యేకమైన డెడికేటెడ్ బటన్ కూడా కనిపిస్తోంది. ఇది గేమింగ్ కంట్రోల్స్ లేదా షార్ట్‌కట్‌ల కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. రిపోర్టుల ప్రకారం HONOR WIN సిరీస్ ఫోన్‌లు Snapdragon 8 Gen 5, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌లతో రావచ్చని అంచనా.
IP68+IP69 రేటింగ్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g Power (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
ఇక పవర్ బ్యాక్‌అప్ విషయంలో ఈ ఫోన్‌లు నిజంగా గేమింగ్ యూజర్లను ఆకట్టుకునేలా ఉండనున్నాయి. సుమారు 8000mAh భారీ బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. HONORకు చెందిన AAK-AN00, AAP-AN00 మోడల్ నంబర్లతో ఉన్న ఫోన్‌లు 3C సర్టిఫికేషన్ పొందినట్లు సమాచారం. లీక్‌లు, రిపోర్టుల ప్రకారం HONOR WIN మరియు WIN RT ఫోన్‌లలో.. 6.83 అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫుల్-లెవల్ వాటర్ రెసిస్టెన్స్, పెద్ద సెన్సార్‌తో 50MP మెయిన్ కెమెరా వంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 26 లాంచ్ తర్వాత పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు స్పష్టత రానున్నాయి.