ఇప్పుడు చాటింగ్, కాలింగ్, వీడియో కాలింగ్ విషయంలో ఎక్కువ మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు.. ఆ సదుపాయాలన్నీ కూడా ఫేస్‌బుక్ మెసేంజర్‌లో ఉన్నాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ చాటింగ్ సదుపాయం ఉంది.. అయితే, కొన్ని సమస్యలు మాత్రం ఉన్నాయి.. ఇప్పుడు వాటికి పులిస్టాప్ పెట్టి.. మరింత అభివృద్ధి చేసేందుకు సిద్ధం అయ్యింది మోటా సంస్థ.. ఫేస్‌బుక్ మెసేంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లో డేటా భద్రత కోసం కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. మెసేంజర్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాకప్ చేసుకునే చాట్ సంభాషణలకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌తో భద్రత కల్పించనున్నట్లు పేర్కొంది.. ఎక్కువ మంది యూజర్లు భవిష్యత్తు అవసరాల కోసం తమ చాట్ సంభాషణలను బ్యాకప్ చేస్తున్న విషయం తెలిసిందే.. కానీ, అనుకోకుండా ఫోన్ పోగొట్టుకుంటే, తమ సమాచారం ఇతరుల చేతికి చిక్కకుండా, కొత్త ఫోన్‌లో బ్యాకప్‌లోని చాట్ సంభాషణలు తిరిగి పొందేందుకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని మెటా సంస్థ చెబుతోంది.
Read Also: Flood Warning at Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు పెరిగిన వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌లో భాగంగా రెండు ఆప్షన్లను తన యూజర్లకు అందించనుంది మెటా.. ఫోన్ పోగొట్టుకుంటే పిన్ లేదా కోడ్ సాయంతో అందులోని డేటా తిరిగి పొందే వీలు కల్పిస్తోంది.. వీటితోపాటు థర్డ్‌పార్టీ క్లౌడ్ సేవల ద్వారా రీస్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది.. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని, త్వరలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.. ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ చాట్‌ల కోసం కొత్త సురక్షిత స్టోరేజ్ ఫీచర్‌ను పరీక్షించాలని యోచిస్తోందని కంపెనీ గురువారం ప్రకటించింది. అదనంగా, కంపెనీ మెసెంజర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎండ్-టు-ఎండ్-ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లకు కొత్త పరీక్షలు మరియు అప్‌డేట్‌లను కూడా వెల్లడించింది, ఇవి రాబోయే రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. కొత్త సెక్యూరిటీ ఫీచర్‌తో వినియోగదారులు తమ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ చాట్ హిస్టరీని సురక్షితంగా బ్యాకప్ చేసుకోగలుగుతారని గతంలో ఫేస్‌బుక్ అని పిలిచే మెటా తెలిపింది.
కంపెనీ అన్‌సెండ్ మెసేజ్‌ల ఫీచర్, ఫేస్‌బుక్ స్టోరీస్ ఫీచర్‌కు రిప్లై చేయడం మరియు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు మరియు కాల్‌లను యాక్సెస్ చేయడానికి ఇతర మార్గాలను పరీక్షించడం ప్రారంభిస్తుంది. ఫేస్‌బుక్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌ల ఫీచర్‌ను రే-బాన్ స్టోరీస్‌కు అనుసంధానిస్తుంది, ఇది వినియోగదారులకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ హ్యాండ్స్-ఫ్రీ సందేశాలను ఇతరులకు పంపడానికి అనుమతిస్తుంది. గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ మరియు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లలో అందుబాటులో ఉన్న కోడ్ వెరిఫై అనే ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌ను ఫేస్‌బుక్ కూడా ఆవిష్కరించింది.