ఈరోజుల్లో చాలా మందికి సొంతంగా వాహనాలు ఉన్నాయి.. వారి స్థాయికి తగ్గట్లు కార్లు లేదా బండ్లు కొంటారు.. అయితే మనం ఏదైనా తెలియని ఊర్లకు కూడా వెళ్తారు.. అక్కడ మనకు కావలసిన ప్రదేశానికి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ ను తప్పనిసరిగా వాడుతారు.. ఈ మ్యాప్‌లో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి. కొన్నిసార్లు వాహనాలు నదులు, బావులు, చిన్న చిన్న గల్లీల్లోలకి కూడా దూసుకుపోయాయి. ఇలా అనేక మంది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.. ఈ మధ్య ఎక్కువగా గూగుల్ ను నమ్ముకొని మోస పోయిన వారినే మనం చూస్తున్నాం..
అకస్మాత్తుగా వచ్చే సమస్యను గూగుల్ మ్యాప్ అప్‌డేట్ చేయలేదు. అంచనా వేయదు. దీంతో ఒక్కోసారి స్పీడ్‌గా వెళ్తున్న కారు కూడా సడన్‌గా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి. ఒక్కోసారి రోడ్డు డైవర్షన్ గురించి తెలియక దారి తప్పిన సందర్భాలు చూస్తున్నాం.. ఇలాంటి వాటి నుంచి బయట పడటానికి అద్భుతమైన యాప్ ఒకటి అందుబాటులో ఉంది.. ఆ యాప్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సేఫ్ డ్రైవింగ్ కోసం ఓ కొత్త యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌తో మన డెస్టినేషన్‌ను సేఫ్‌గా చేరుకోవడంతోపాటు మనం వెళ్తున్న వాహనాలకు ముందు రాబోయే ప్రమాదాలను కూడా ఈ యాప్ హెచ్చరిస్తుంది. డైవర్షన్, స్పీడ్ బ్రేక్, రిపేర్స్, ట్రాఫిక్, ఇలా అన్నీ మనకు వాయిస్ మెసేజ్ ద్వారా అందిస్తుంది. ఇక మన చేరుకునే గమ్యానికి దగ్గరి దారిని కూడా చూపుతుంది.. అలాగే ప్లై ఓవర్స్ ఉంటే కూడా ముందే చెబుతుంది.. ఈ యాప్ పేరే మాపిల్స్ మ్యాప్ (maapls map).. గూగుల్ మ్యాప్ కన్నా ఎక్కువ స్పీడ్ గా పని చేస్తుంది.. మనల్ని ప్రమాధాలకు దూరంగా కూడా ఉండేలా చేస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు..