గతంలో చౌకగా అందించిన టెలికాం సేవలు ఇప్పుడు భారంగా మారాయి. బీఎస్ఎన్ఎల్ ఒక్కటే కాస్త అందుబాటు ధరల్లో ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తోంది. స్వల్పకాలిక వాలిడిటీ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు కావాలనుకునేవారికి శుభవార్త. BSNL కొత్తగా రూ.87 ధరతో ప్రారంభించిన ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎందుకాలస్యం వెంటనే చదివేయండి.
బీఎస్ఎన్ఎల్ కేవలం 14 రోజుల చెల్లుబాటు కాలానికి అన్ని రకాల ప్రయోజనాలను అందించేలా రూ.87 ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌తో లభించే ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఒక GB రోజువారీ డేటాతో మొత్తం వాలిడిటీ కాలానికి 14GB డేటాను అందిస్తోంది. రోజువారి డేటా తర్వాత స్పీడ్ 40 Kbpsకి తగ్గించబడుతుంది. ఇంకా వినియోగదారులు రోజుకు 100 SMSలతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా పొందవచ్చు. చివరగా రూ.100లోపు ధరలో లభించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు SMSలు పంపడానికి వీలు కల్పిస్తుంది. ఛత్తీస్‌గఢ్ మరియు అస్సాం వంటి రాష్ట్రాల వారికి ఈ ప్లాన్ అందుబాటులో లేదు.
14 రోజుల వ్యవధి కోరుకునేవారికి ఇది మంచి ప్లాన్ అని చెప్పవచ్చు. అలాగే BSNL రూ.797 వోచర్ ప్లాన్ లో మొదటి 60 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు అందించబడుతుంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 80 Kbpsకి తగ్గించబడుతుంది. 60 రోజుల తర్వాత ప్రయోజనాల గడువు ముగుస్తుంది కానీ SIM కార్డ్ సంవత్సరం పొడవునా యాక్టివ్ దశలో వుండడం దీని ప్రత్యేకత.
ఈ ప్లాన్ యొక్క సాధారణ వాలిడిటీ 395 రోజులు. అయితే జూన్ 12, 2022 లోపు రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు BSNL ఈ ప్లాన్‌తో 30 రోజుల అదనపు చెల్లుబాటు గడువును పొడిగిస్తోంది. రూ.797 వోచర్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న వారు 60 రోజుల తరువాత వారి సిమ్ యాక్టివ్‌లో వుంటుంది కాబట్టి ఇన్ కమింగ్ కోసం ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎంచక్కా ఇన్ కమింగ్ కాల్స్ ఉచితంగా అందుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు.
అలాగే ఎస్టీవీ రూ.399 ధరతో 80 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 1GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే STV 429 ప్లాన్‌లో 81 రోజుల వాలిడిటి, రోజుకు 1GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMS ప్రయోజనాలు అందుకోవచ్చు. వీరికి అదనంగా Eros Now ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు ఉచితంగా అందిస్తోంది.
Samsung AI Washing Machines: ఏఐ టెక్నాలజీతో వాషింగ్ మెషీన్లు