టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రిమోట్ తోనే కాదు స్మార్ట్ ఫోన్ తో పనిచేసే గృహోపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. సామ్‌సంగ్ సంస్థ తాజాగా దేశీయ మార్కెట్‌లో సరికొత్త వాషింగ్ మెషీన్లను విడుదలచేసింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీతో ఎకోబబుల్ శ్రేణిలో పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లను విడుదల చేసింది. ఇప్పటికే వాషింగ్ మెషీన్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్ల రంగంలో సామ్ సంగ్ వినియోగదారుల ఆదరణ చూరగొంటోంది.
ఈ వాషింగ్ మెషీన్లు 7, 8, 9, 12 కేజీల సామర్థ్యం కలిగి వుంటాయి. ఈ వాషింగ్ మెషీన్లు ప్రారంభ ధర రూ.41,600లుగా ఉంది. ఏఐ వాష్, ఎయిర్ వాష్ టెక్నాలజీ, సూపర్ స్పీడ్ సైకిల్ వంటి ఇంటిలిజెంట్ ఫీచర్లతో 40 మోడల్స్‌ను తీసుకువస్తున్నామని సామ్ సంగ్ తెలిపింది. వీటి ప్రత్యేకత ఏంటంటే.. స్మార్ట్ డివైజ్‌లతో కనెక్ట్ చేసుకునే సౌలభ్యం వీటికి వుంది.
ఈ వాషింగ్ మెషీన్లను గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, సామ్‌సంగ్ స్మార్ట్ టీవీలు, ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్లతోపాటు అలెక్సా, గూగుల్ హోం వంటి వాయిస్ డివైజ్‌లతోనూ కనెక్ట్ చేసుకోవచ్చు. నీటి వినియోగం, డిటర్జంట్ల వాడకం, బట్టలు ఉతికే సమయం ఇలా అన్ని విషయాల్లోనూ వినియోగదారులకు అత్యుత్తమ అనుభవం వీటి ద్వారా లభిస్తుంది. మూడు సంవత్సరాల వారంటీతో ఈవాషింగ్ మెషీన్లు కొనుక్కోవచ్చు. అన్ని రిటైల్ స్టోర్లతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లోనూ అందుబాటులో ఉంటాయి. ఈ వాషింగ్ మెషీన్ల కొనుగోలుపై 25 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 8, 9 కేజీల మోడల్స్‌పై 17.5 శాతం వరకు, 7 కేజీల మోడల్‌పై 12.5 శాతం వరకు అదనపు క్యాష్‌బ్యాక్ సౌకర్యం వుంది. నో కాస్ట్ ఈఎంఐ వెసులుబాటు కూడా ఉండగా, రూ.990కే ఈఎంఐ మొదలుకానుంది. మంచి వాషింగ్ మెషీన్ కావాలనుకునేవారు సామ్ సంగ్ లేటెస్ట్ మోడల్ వాషింగ్ మెషీన్లు ట్రై చేయవచ్చు.
Phone Battery Life: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే టిప్స్