ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(73) ఆదివారం కన్నుమూశారు. అంతకుముందు అనారోగ్య కారణాలతో ఆయన అమెరికాలోని ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు