కేంద్రం బాటలో ఏపీ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది. ప్రభుత్వ ఆస్తుల మోనటైజేషన్ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిషన్ బిల్డ్ ఏపీలో భాగంగా విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని కమర్షియల్ డెవలప్ మెంట్ కోసం అప్పగించింది ప్రభుత్వం. దీని కోసం మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తోంది. మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను రుద్రాభిషేక్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు అప్పగించింది. మొత్తం 3.26 ఎకరాల్లో విస్తరించిన స్టేట్ గెస్ట్ హౌస్ ను లక్ష చదరపు…
వినాయక చవితి ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది… సీఎం వైఎస్ జగన్, ఏపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి… ఇక, వ్యవహారంలో సీఎం జగన్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి కిడారి.. వినాయక చవితి వేడుకలు రద్దు చేయడం ఏంటి? అని ప్రశ్నించిన ఆయన.. కులాలు, మతాల మధ్య సీఎం జగన్ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.. వినాయక చవితి వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించిన ఆయన.. తల్లిదండ్రులు వద్దంటున్నా…
సోషల్ మీడియాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఏదిపడితే అది పెడుతూ ఆందోళనకు గురిచేసేవాళ్లు కొందరైతే.. మతవిశ్వాసాలను దెబ్బకొట్టే విధంగా.. రెచ్చగొట్టే విధంగా.. దేవుళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు.. ఇలా అన్నింటిపై పోస్టులు పెట్టేవారు ఉన్నారు. అయితే, ఈ మధ్య కొందరు ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంపై కూడా పోస్టులు పెడుతున్నారు.. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. శ్రీశైలం ఆలయ ప్రతిష్ట దిగజార్చే పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి.. దేవస్థానంపై అసత్య ప్రచారం…
వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. వాహనదారులకు రోడ్లు నరకపాయంగా మారిపోయాయి.. ఏపీ ప్రభుత్వంపై ఈ వ్యవహారంలో విమర్శలు కూడా వెల్లువిత్తాయి.. ఈ నేపథ్యంలో రోడ్లు బాగు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి, శంకర్‌నారాయణ, మేకపాటి గౌతంరెడ్డి.. సంబంధిత అధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్టోబర్ మాసానికల్లా వర్షాలు…
సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం వైఎస్ జగన్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేవారు జూపూడి ప్రభాకర్… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్న ఆయన.. తన కేబిన్‌లో కూడా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని ప్రశంసించారు.. చంద్రబాబు హయాంలో ఎందుకు సామాజిక న్యాయం పాటించలేక పోయారు? అని ప్రశ్నించిన జూపూడి.. ఒక ఎస్టీని డీజీపీగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారని.. ఎస్టీ అధికారి…
2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించాల్సింది ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి… విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వార్డు, సీతమ్మదార నార్త్ ఎక్స్టెన్షన్ లో స్నీపర్ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సాయిరెడ్డి.. మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గొల్లబాబురావు, జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి తదితరలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అనేక…
గతంలో హడావిడి ఎక్కువగా ఉండేది.. పని తక్కువగా ఉండేది.. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు.. కాగితాల మీద మాత్రమే అగ్రిమెంట్లు కనబడేవి అంటూ గత ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్స్‌ను ఆదుకునేందుకు ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం…
అన్యాక్రాంతం అయిన సింహాచలం భూములపై ప్రభుత్వం దూకుడు పెంచింది. బాధ్యులైన సూత్రధారులు, పాత్రధారుల లెక్కలు బయటపెట్టేం దుకు విజిలెన్స్ విచారణ వేగవంతం అయ్యింది. 2016-2017లో దేవస్థానం ఆస్తుల జాబితా నుంచి 862 ఎకరాలు తొలగించినట్లు దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ గుర్తించి నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రాప ర్టీ రిజిస్టర్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన భూముల విలువ బహిరంగ మార్కెట్లో 10వేల కోట్ల రూపాయలనేది ఓ వాదన. దీంతో దేవుడి సొమ్మును కొల్లగొట్టిన వా…
రాజకీయాలు ఎన్నికల్లో చేసుకుందాం.. ముందైతే అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం… శ్రీకాకుళం జిల్లా అక్కివరం గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ తమ్మినేని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.. మేం శంకుస్థాపనలు చేస్తుంటే కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చేస్తుంటే ఇలా చేయడం సరికాదని హితవుపలికిన తమ్మినేని సీతారం..…