ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తూనే ఉంది.. ఏ క్షణంలోనైనా విశాఖకు రాజధాని తరలిపోవచ్చు అని చెబుతూ వస్తున్నారు మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు.. అయితే, ఇవాళ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితో కలిసి పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని…
టీడీపీ నేత కూన రవికుమార్‌పై ఏపీ ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయ్యింది.. ప్రివిలేజ్ కమిటీ ముందు కూన రవి హాజరుకాకపోవడాన్ని ధిక్కారంగా భావిస్తున్నామని చైర్మన్ కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు.. ఇవాళ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిని ఆదేశించింది ప్రివిలేజ్ కమిటీ.. కానీ, వారు హాజరు కాలేదు.. ఇక, ప్రివిలేజ్ కమిటీ తదుపరి సమావేశం వచ్చే నెల 14వ తేదీన జరపాలని నిర్ణయించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేవారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌లో బోధనలపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.. ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్న ఆయన.. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఏ మీడియంలో చదివాడో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇప్పుడు లోకేష్ కుమారుడు ఏ మీడియంలో చదువుతున్నాడు అని ప్రశ్నించిన మిథున్‌రెడ్డి.. చంద్రబాబు పిల్లలు మాత్రం…
గత ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.. ఎప్పుడైనా విశాఖ కేంద్రం పరిపాలన ప్రారంభం కావొచ్చు అని ఏపీ మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు.. అయితే, వైజాగ్ రాజధాని దిశగా కేంద్రం నుంచి ఆసక్తికరమైన సంకేతం వచ్చింది.. పార్లమెంట్ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఏపీ రాజధాని వైజాగ్‌గా గుర్తించింది…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది.. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాను 50:50 శాతంగా పంచాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ సర్కార్.. అయితే, తెలంగాణ కోరుతున్న 50:50 శాతం నీటి కేటాయింపులు పగటి కలే అని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కేఆర్ఎంబీకి లేఖ రాసినట్లు 70:30 శాతం నీటి కేటాయింపులు గతంలోనే చేశారన్న ఆయన.. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు చేసుకున్న…
చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మాత్రమే ప్రయోజనం చేసే ప్రయత్నం చేశారు.. కానీ, వైఎస్ జగన్ సర్కార్ హయాంలో పరిస్థితి మారిపోయిందన్నారు ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ 26 నెలల కాలంలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ స్థాయి నుంచి బ్యాక్ బోన్ క్లాస్ స్థాయికి ఎదిగారని అభివర్ణించారు. ఈ రెండేళ్ల కాలంలో సుమారుగా 69 వేల కోట్ల రూపాయల ప్రయోజనం బీసీలకు చేకూరిందన్న…
తెలుగుదేశం పార్టీ అయినా, ఆ పార్టీ నేతలైనా ఒంటికాలిపై లేచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. మరోసారి ఆ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ.. తెలుగు తాలిబన్ పార్టీ అంటూ కామెంట్ చేశారు.. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అగ్ని కుల క్షత్రియులను తరిమి తరిమి కొడతామని చెప్పింది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు జోగి రమేష్.. నా మీద కేసు పెట్టాలని టీడీపీ నేతలు డీజీపీకి…
మంత్రి కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు.. మా ప్రభుత్వం వస్తే.. కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తానంటూ హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమన్న ఆయన.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ హితవుపలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రులను ప్రతిపక్ష…
ఆయన విపక్షంలో ఉన్నప్పుడు మాటలు తూటాల్లా పేలేవి. ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నారు. ఉలుకు లేదు.. పలుకు లేదు. అంతా బీ.. కామ్. అనుచరులకు కూడా తమ నేతలో వచ్చిన మార్పు అర్థం కావడంలేదట. ఆయనకేమైంది? ఎవరా నాయకుడు? ఏమా కథ? కీలక అంశాలపై పెదవి విప్పని చెవిరెడ్డి! వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోందట. విపక్షపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ప్రతి అంశంలోనూ దూకుడు ప్రదర్శించిన ఆ చెవిరెడ్డి..…
ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాంగం సృష్టిస్తున్నారు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి నాలుగు రెట్లు ఎక్కువగానే సీఎం జగన్.. బీసీలకు రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. దేశంలో ఏ సీఎం కూడా బీసీలకు రాజ్యాంగం రాయలేదు.. కానీ, బీసీలకు రాజ్యాంగం రాస్తున్న మొట్టమొదటి నాయకుడు వైఎస్ జగన్ అంటూ కీర్తించారు.. బీసీలను తన పక్కన కూర్చొపెట్టుకున్నారు.. మంత్రి పదవులు, ఎంపీ స్థానాలు ఇచ్చి…