కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు.
వెన్నుపోటు దినోత్సవం కేవలం పనిలేక చేసినట్టు ఉందని.. కూటమి ప్రభుత్వం లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసిందన్నారు. ఏడాది కాలంలో పెన్షన్, అన్నక్యాటీన్, ఉచిత గ్యాస్ సిలిండర్, యువతకి డీఎస్సీ వంటి కార్యక్రమాలు చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం సహకారంతో అమరావతి, పోలవరం, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అసలు జరగవు అనుకున్న కార్యక్రమాలు చేసి చూపించామని తెలిపారు. ప్రతిపక్షానికి ఆనాడే…
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు పెట్టారు పోలీసులు.. అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించిన వైసీపీ 'వెన్నుపోటు దినం' పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.. అయితే, ర్యాలీగా వస్తున్న అంబటిని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. దీంతో, సీఐపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అంబటి రాంబాబు..
జోగి రమేష్... మాజీ మంత్రి. వైసీపీ హయాంలో కేబినెట్ మినిస్టర్గా ఉండి కూడా... కనీస హుందాతనం లేకుండా తమ నాయకుల మీద విచ్చలవిడిగా నోరు పారేసుకున్నారని, ఆయన చేతలు కూడా అలాగే ఉండేవన్నది టీడీపీ, జనసేన అభియోగం. చంద్రబాబు, లోకేష్, పవన్ మీద హద్దులు దాటి మాట్లాడటమేగాక... బాబు ఇంటి మీద దాడికి ప్రయత్నించిన ఘటనతో పార్టీ హిట్ లిస్ట్లో చేరారాయన.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వెన్నుపోటు పొలిటికల్ సీజన్ జోరుగా నడుస్తోంది. ఎవరు ఎవరిని పొడిచారు, అసలు పొడిచారా? లేదా అన్న వాదనల్ని కాసేపు పక్కనపెడితే... అందరి నోట అదే మాట మాత్రం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ వెన్నుపోటు దినం ప్రోగ్రామ్ నిర్వహిస్తే... అంతకంటే ముందే... ఆ పార్టీ నాయకుడు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వెన్నుపోటు కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వైసీపీలోనే వెన్నుపోటుదారులు ఉన్నారని ప్రకటించి సంచలనానికి తెరలేపారాయన.
సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4న చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చాడు.. ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు.. చంద్రబాబు తనను నమ్మిన ప్రజలనే మోసం చేశాడు.. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు అని దుయ్యబట్టారు జగన్..
వైసీపీ ఎప్పుడూ ప్రజలపై బాధ్యతాయుతంగా వ్యవహరించిందని.. జగన్ ప్రజలే అన్నీ అని నమ్మారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాగ్రహాన్ని ఇప్పటికైనా గమనించండన్నారు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా వెళ్తే ప్రజలు సమాధానం చెబుతారని.. ప్రజల అభీష్టం మేరకే పార్టీలకు మనుగడ సాగించగలవని చెప్పారు.
అమరావతి: నేడు బెంగళూరుకు వైఎస్ జగన్. మధ్యామ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు జగన్. అమరావతి: వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టునున్న వైసీపీ శ్రేణులు. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి. హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణలు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు. కోస్తా జిల్లాల్లో 39-40 డిగ్రీల…
2014 - 19 మధ్య కాలంలో జరిగిన తుని రైలు దగ్ధం కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాధం సహా మరో 40 మందిపై అప్పట్లో కేసు నమోదైందని.. ఆ తర్వాత సరైన సాక్ష్యాలు లేకపోవటంతో కోర్టు కొట్టివేసిందని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు.. అప్పటి ఘటనపై తాజాగా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లాలనుకుందని చెప్పారు.. సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..? అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లోకి చేరుస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు…
జగన్ ఒక రంగుల రెడ్డి, జగన్ వి చీప్ పాలిటిక్స్.. తల్లిని, చెల్లిని మోసం చేసింది జగన్ అని మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారని... గత 5 ఏళ్లలో దళితులపై దాడులు ఎలా చేశారో చూశామన్నారు.. జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రౌడీ షీటర్ లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమేనన్నారు.