Narayana Swamy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలను కూటమి ప్రభుత్వం అరికట్టలేకపోతున్నదంటూ చిత్తూరులో వైస్సార్సీపీ మహిళా విభాగం నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరు చూస్తుంటే మనం భారతదేశంలో ఉన్నామా..? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా..? అన్న అనుమానం కలుగుతోంది. ఏపీలో ప్రజలు నార్త్ కొరియా తరహా పాలనను అనుభవిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
Read Also: Devineni Avinash: రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి.. దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు..!
గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై జరిగిన దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిందని నారాయణస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు గౌరవంగా, భద్రతగా ఉన్న కాలం సాగింది. కానీ ఇప్పుడు మహిళలు ఆత్మవిశ్వాసం కోల్పోయారని అన్నారు. అలాగే ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్‌ను నారాయణస్వామి ఖండించారు. ఐదు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్న వ్యక్తిని చేయని తప్పుకు అరెస్ట్ చేయడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని అభిప్రాయపడ్డారు. ఒక డిబెట్‌లో గెస్ట్ అమరావతి మహిళలపై మాట్లాడిన మాటలకు జర్నలిస్టును ఎలా బాధ్యుణ్ణి చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా.. అదే డిబెట్‌లో గెస్ట్, జర్నలిస్ట్ ఇద్దరూ క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ఆ ఛానెల్ యాజమాన్యం కూడా వ్యాఖ్యలను ఖండించినా, ఈ అరెస్ట్ చేయడం అర్థరహితం అన్నారు.
Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
ఎల్లో మీడియాల్లో వైఎస్ భారతి, విజయమ్మలపై అనేకమంది టీడీపీ నేతలు మాట్లాడారు. వారి మాటలకు యాంకర్లను, నేతలను అరెస్ట్ చేయలేదేం? అని ప్రశ్నించారు. వైస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవం ప్రజల్లో మంచి స్పందన పొందింది.. దాన్ని తప్పుదోవ పట్టించేలా డైవర్షన్ రాజకీయాల కోసం కొమ్మినేని వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.