వైసీపీ మహిళా విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ మహిళా విభాగం.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆరోపిస్తోంది.. అందుకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం..
జగన్ రెడ్డిని దేవుడు కూడా క్షమించడు అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జగన్ రెడ్డి ఖండించడంతో ఆడపడుచుల పట్ల ఆయనకున్న ఆలోచనలు బయటపడ్డాయన్న ఆయన.. విశ్లేషకుడిగా కృష్ణంరాజు తెలుగు ఆడపడుచుల గురించి నీచాతినీచంగా, క్రూరంగా మాట్లాడుతుంటే ఆ క్షణమే ఖండించి, క్షమాపణ చెప్పించి, డిబేట్ నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత కొమ్మినేనితో పాటు యాజమాన్యానికి లేదా..? అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి.. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.
వెన్నుపోటు దినం ర్యాలీలు వైసీపీకి మాంఛి కిక్కు ఇచ్చాయా? ఆ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అని పార్టీ అధిష్టానం భావిస్తోందా? అందుకే సీక్వెల్‌ను సిద్ధం చేస్తోందా? ఏంటా కొనసాగింపు కార్యక్రమాలు? పార్టీ అధిష్టామం మనసులో ఏముంది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. ఏడాది పూర్తయినా ఎన్నికల హామీలను మాత్రం అమలు చేయలేదంటూ ఆందోళన బాట పట్టింది వైసీపీ. ఫలితాలు వెలువడ్డ జూన్ 4న వెన్నుపోటు దినం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. నాడు…
కాపు ఉద్యమనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మానాభం క్యాన్సర్‌తో బాధపడుతున్నారట.. ఈ విషయం తెలిసి.. తన తండ్రిని కలిసేందుకు వెళ్లిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతిని అడ్డుకున్నారట కుటుంబ సభ్యులు.. ముద్రగడను కలిసేందుకు ఆయన కుమారుడు గిరి నిరాకరించాడట.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి..
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పై తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు.. వైసీపీ అధిష్టానం పిలుపుమేరకు వెన్నుపోటు దినం పేరిట పార్టీ శ్రేణులతో కలిసి మొలకలచెరువులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి.. 300 మందితో ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు మొలకలచెరువు పోలీసులు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీది వేముల వద్ద వైసీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ ను దారుణంగా హత్య చేశారు. దుండగులు బండ రాయితో తలపై కొట్టి చంపారు. కర్నూలు నుంచి బైక్ పై సొంతూరు మీదివేములకు వెళ్తుండగా కాపుకాచి హత్య చేశారు. హత్యకు రాజకీయపరమైన కారణాల, వ్యక్తిగత కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని.. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కిందట ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ద్వారా ఎనిమిది కోట్లు పట్టుకున్నట్టు తెలిసిందని.. తనిఖీల్లో 8 కోట్ల రూపాయలు దొరికితే, దానికి అన్ని ఆధారాలు సమర్పించారన్నారు.
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరు లోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైఎస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు…