Krishna District: కృష్ణా జిల్లా మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ కటౌట్‌కు గర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బందరు డీఎస్పీ భాషా, పెడన రూరల్ సీఐ వీరయ్య ప్రసన్నగౌడ్, గూడూరు ఎస్సై వెంకట్…
కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు వైసీపీ కార్యకర్తలు.. కర్నూలు ద్రోహి అంటూ నినాదాలు చేశారు.. మూడు రాజధానులు కావాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు ఓవైపు.. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ శ్రేణులు మరోవైపు నినాదాలు, తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, వారిపై అదేస్థాయిలో విరిచుకుపడ్డారు…
కర్నూలు జిల్లా పర్యటనలో ఇక నాకు ఇవే చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి.. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇక, చంద్రబాబు కామెంట్లపై స్పందించిన ఉషశ్రీ చరణ్.. వంచనకు మరోపేరు చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందే చేతులెత్తేశారని.. అందుకే ఇవే చివరి ఎన్నికలు…
Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాని పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభూత కల్పనలను నిజాలుగా చూపించే క్రెడిట్ టీడీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాప్తాడుకు జాకీ పరిశ్రమ వచ్చింది భూముల కోసమేనని.. వారు ఇక్కడ భూములతో వ్యాపారాలు చేయాలని చూశారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. జాకీ పరిశ్రమ టీడీపీ హయాంలో వచ్చినట్లు.. వైసీపీ హయాంలో వెనక్కి…
VijayaSai Reddy: వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు ఓడిస్తే అవే తనకు చివరి ఎన్నికలంటూ కర్నూలు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు స్పందిస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్విట్టర్లో స్పందించారు. తనకు కాలం చెల్లిందని చంద్రబాబు స్వయంగా అంగీకరించడం ఆయన రాజకీయ చాణక్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ…
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవే నాకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు.. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే.. ఇదే నాకు చివరి ఎన్నిక అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచాయి… అసెంబ్లీలో నన్ను అవమానించారు.. నా భార్యను కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… ఇప్పుడున్నది కౌరవ సభ అని ఆరోపించారు.. ఆ కౌరవ…