రాజకీయాలు చెడిపోయాయి.. లాస్ట్ ఛాన్స్ అంటూ వస్తున్నవారికి మరో ఛాన్స్ ఇవ్వొద్దని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి వస్తే ఎన్టీఆర్, ఎంజీఆర్, వైఎస్ జగన్ అంటారన్న ఆయన.. పిల్లను ఇచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునేవారిని చంద్రబాబు అంటారంటూ ఎద్దేవా చేశారు.. తమ ఆస్తిని అనుభవించేవారిని హక్కుదారుడు అంటాం.. పరాయి వారి ఆస్తిని కాజేసేవారిని కబ్జాదారుడు అంటామని.. రావణుడిని సమర్థించేవారిని రాక్షసులు అంటాం.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడిచిన నాయకుడిని అసెంబ్లీకి పంపాలా? ఇలాంటి వ్యక్తికి మరోఛాన్స్ ఇస్తారా? మీ సేవలు వద్దు బైబై బాబు అని ఇంటికి పంపాలా? వద్దా? ప్రజలకు మోసం చేసిన బాబుని అసెంబ్లీకి పంపాలా..? మీ సేవలు వద్దు బాబు అని ఇంటికి పంపాలా? ఆలోచించాలని సూచించారు సీఎం వైఎస్ జగన్..
రాజకీయాలు చెడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. తనకు తాను పార్టీ పెట్టుకొని, వేరొకరికి సహాయం చేస్తున్నాడు దత్తపుత్రుడు అంటూ పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. రాజకీయం అంటే జవాబుదారీతనం, మంచి చెస్తే ఉంటారు.. లేకపొతే తప్పుకుంటారని బావన రావాలి అన్నారు.. నేను దేవుడిని, ప్రజల్ని నమ్ముకుంటున్నానని వ్యాఖ్యానించారు.. ఇక, సబ్ రిజిస్ట్రేషన్ అంశంలో లంచాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.. శాశ్వత భూహక్కు , భూ రక్ష కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు.. రాష్ర్టంలో జరుగుతున్న మార్పును రైతులు గమనించాలి.. జగన్న భూ హక్కు అంశంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు.. లంచాలకు తావులేకుండా ఉండేందుకే పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తున్నాం.. గ్రామ సచివాలయాలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాల ఏర్పాటు ఇలా ఎన్నో కార్యాక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు.
నాడు రాష్ట్రంలో 11 మెడికల్ కళాశాలలు ఉంటే.. నేడు 17 మెడికల్ కళాశాలలు కడుతున్నామని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.. రైతుకు తోడుగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.. వెల్‌నెస్ సెంటర్లు, నాడు నేడు కింద స్కూళ్లు, గ్రామస్థాయిలో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.. అక్కచెల్లెమ్మల భద్రతకు దిశా యాప్ తీసుకొచ్చాం.. దీని ద్వారా పోలీసులు చెల్లెమ్మలకు తోడుగా ఉంటున్నారని తెలిపారు.. ఐదేళ్ల చంద్రబాబు, దత్తపుత్రుడు సంసారంలో కిడ్ని సమష్య గుర్తుకు రాలేదు.. అని మండిపడ్డ ఆయన.. తాము రూ.765 కోట్లతో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుకు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం, కిడ్నీ బాధితులకు రూ.10 వేల పెన్షన్ కూడా ఇస్తున్నామన్నారు.. కిడ్ని రోగాల శాశ్వత పరిష్కారానికి అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. గతంలో 295 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సేవలలించేవారు.. నేడు 11,000 గ్రామసచివాలయాలను రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా మారుస్తున్నాం అన్నారు సీఎం జగన్..