బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా జరగుతోన్న జయహో బీసీ మహాసభ వేదికగా ఆయన మాట్లాడుతూ.. గంజి పేదోడి పొట్టకి, మన బట్టకి అని చంద్రబాబు గతంలో చెప్పాడు.. ఇంత మంది బీసీలను చూసి చంద్రబాబు గుండె దడదడలాడతాయన్నారు. ఇక, ఇంగ్లీష్ విద్యను గ్రామ స్థాయి వరకు తీసుకుని వెళ్లిన వ్యక్తి సీఎం జగన్ అంటూ ప్రశంసలు కురిపించిన ఆయన.. ఐటీ నేనే తెచ్చాను.. ఐటీలో ఉన్న వాళ్ళు తనకు రాయల్టీ కట్టాలని అడిగారు అంటూ ఎద్దేవా చేశారు..
Read Also: Jayaho BC Maha Sabha Live: జయహో బీసీ మహాసభ లైవ్ అప్‌డేట్స్
అప్పట్లో ఐటీలో ఉద్యోగాలు ఉన్నత కులాలకే వచ్చాయని విమర్శించిన ఆయన.. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఫీజు రీయింబర్‌మెంట్ పథకం పెట్టిన తర్వాతే వెనుకబడిన కులాలు చదువుకోగలిగాయన్నారు.. కానీ, చంద్రబాబు బీసీలను కుల వృత్తుల వారీగానే చూశాడని మండిపడ్డారు.. బీసీలను తోలు తీస్తాం, తోకలు కత్తిరిస్తాం అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కానీ, బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు చెల్లుబోయిన వేణు గోపాల్. కాగా, జయహో బీసీ మహాసభకు 80 వేలకుపైగా మంది బీసీ నేతలకు ఆహ్వానం పంపింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వేదిక పై 182 మందికి చోటు కల్పించారు.. సభను ఉద్దేశించి బీసీ మంత్రులు, ఎంపీలు, అసెంబ్లీ స్పీకర్, పార్టీ బీసీ వింగ్ అధ్యక్షుడు, జిల్లాల బీసీల అధ్యక్షులు ఇలా వరుసగా ప్రసంగాలు కొనసాగిస్తున్నారు.. ఇక, మధ్యాహ్నం బీసీ మహాసభ సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. 12 గంటల నుంచి ఒంటి గంట వరకు.. గంట సేపు ముఖ్యమంత్రి జగన్ ఉపన్యాసం సాగనుంది.. నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు వైసీపీ అధినేత.